హైకోర్టుకు కొన్ని పరిమితులు ఉన్నాయి

By Kiran.G 18-11-2019 05:34 PM
హైకోర్టుకు కొన్ని పరిమితులు ఉన్నాయి

45 రోజులుగా తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె గురించిన వాదనలు హైకోర్టులో ముగిసాయి . పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని, గతంలో సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పులను పరిశీలించాలని హైకోర్టును ప్రభుత్వం తరపున అడ్వకెట్ జనరల్ కోరారు.ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని , కార్మికుల డిమాండ్లను తీర్చలేమని, ఆర్టీసీ విలీనం డిమాండ్ పక్కన పెట్టినా మళ్ళీ అదే డిమాండ్ తో ఏదొకరోజు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెడతారని,యూనియన్ నేతలు స్వార్ధంతో సమ్మె చేస్తూ ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతున్నారని, సమ్మె చట్ట విరుద్ధంగా జరుగుతుందని ప్రకటించాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు.

చర్చలు నిర్వహించడానికి కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది హైకోర్టును కోరగా, కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా కమిటి వెయ్యాలని ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. 45 రోజులుగా జరుగుతున్న సమ్మె కారణంగా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, జీతాలు లేక కుటుంబ పోషణ కష్టం అవుతుందని, ప్రభుత్వం మాత్రం తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను నడిపిస్తూ ఆక్సిడెంటులు చేస్తుందని హైకోర్టుకు తెలిపారు.

సమ్మె లీగల్ ఇల్లీగల్ అని హైకోర్టుకు చెప్పే అధికారం లేదని హైకోర్టు తెలిపింది. హైకోర్టుకు కొన్ని పరిమితులు ఉన్నాయని ఆ పరిధిని దాటి ముందుకు వెళ్లలేమని ఆర్టీసీ జెఎసికి హైకోర్టు స్పష్టం చేసింది. సమ్మెపై ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ముందు రెండు అంశాలు ఉన్నాయని ఒకటి సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించడం లేదా కార్మికులను చర్చలకు పిలవమని ప్రభుత్వాన్ని ఆదేశించడం ఇవి రెండే హైకోర్టు ముందున్న అంశాలని తెలిపింది. కానీ కోర్టుకు ఆ పరిధి లేదని కొన్ని పరిమితులు ఉన్నాయని తెలిపింది. ఆర్టీసీ సమ్మె వ్యవహారాన్ని లేబర్ కమిషనర్ ముందుకు తీసుకెళ్లాలని, ఆర్టీసీ సమ్మెపై రెండువారాల్లోగా ఏదొక నిర్ణయం తీసుకోవాలని, కార్మిక కోర్టుకు వెళ్లాలా వద్దా అనేది లేబర్ కమిషనర్ నిర్ణయించాలని హైకోర్టు ఆదేశించింది.

idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News