కరోనా సమయంలో ‘తూర్పు’ కలెక్టర్‌ వినూత్న విధానం

By Jaswanth.T Aug. 09, 2020, 01:00 pm IST
కరోనా సమయంలో ‘తూర్పు’ కలెక్టర్‌ వినూత్న విధానం

ఇప్పుడు ఎక్కడ విన్నా, చూసినా ఒక్కటే మాట కరోనా.. కరోనా. రోగ మొచ్చినా ఇదేమట, ఆసుపత్రికి వెళ్ళినా ఇదే.. చికిత్స పొందుదామన్నా ఇదే. కొత్తగా వచ్చి ఈ రోగాన్ని అర్ధం చేసుకుని, అందుకు అనుగుణమైన చికిత్సను అనుకరించడానికే ఇప్పటి వరకు సమయం పట్టేసింది. దీంతో అన్ని రంగాలు దాదాపు షడౌన్‌ అయిపోయాయి. ప్రైవేటు వైద్యరంగమైతే మరీను. దాదాపు అన్ని సేవలు నిలిపివేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే వైద్య రంగాన్ని గాడిలో పెట్టేందుకు కార్యాచరణను రూపొందించే పనిలో పడ్డాయి.

ప్రభుత్వ వైద్య రంగం మొత్తం ఫోకస్‌ కరోనాపై పెట్టింది. దీంతో ఇతర ఆరోగ్య సమస్యలకు వైద్యం అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల సేవల్ని వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టారు. కోవిడ్‌ విషయంలో హోమ్‌ క్వారంటైన్‌ లాంటి ప్రయోగాత్మక విధానాలను అమలు చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధరరెడ్డి మరో అడుగు అటువంటిదే వేసారు. జిల్లా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని జిల్లా కోవిడ్‌ ఆసుపత్రిగా గుర్తించడం, ఆ ఆసుపత్రిలో లభించే ఇతర సేవలను ప్రైవేటు ఆసుపత్రులకు విభాగాల వారీగా అప్పగించారు.

ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ, గైనకాలజీ, న్యూరో, సర్జికల్‌ గ్యాస్ట్రో, కార్డియాలజీ, నెఫ్రాలజీ, జనరల్‌ మెడిసిన్‌ తదితర విభాగాలను కాకినాడలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సంబంధిత అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందే విధంగా చర్యలు చేపట్టారు. కోవిడ్‌ సంక్షోభంలో ఉన్న ఆరోగ్య రంగాన్ని గాడిలో పెట్టేందుకు జరిగే ఇటువంటి ప్రయత్నాలతో ప్రజలకు ఆయా వ్యాధుల నుంచి తప్పకుండా ఊరట లభిస్తుందనడంలో సందేహం లేదు.idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp