నామినేషన్లు ఉపసంహరించుకోండి.. బీజేపీని గెలిపించండి: పవన్‌ కళ్యాణ్‌

By Kotireddy Palukuri Nov. 20, 2020, 05:22 pm IST
నామినేషన్లు ఉపసంహరించుకోండి.. బీజేపీని గెలిపించండి: పవన్‌ కళ్యాణ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. బీజేపీ గెలవాలని కోరుకుంటున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ ఆకాంక్షించారు. జనసేన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరారు. జనసేన ఓటు ఒక్కటి కూడా బయటకు వెళ్లకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పవన్‌ కళ్యాన్‌ బీజేపీ నేతలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలసి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ నేత కె.లక్ష్మణ్‌లతో చర్చించారు. అనంతరం మీడియాతో పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి మద్ధతు తెలిపారు.

కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. పార్టీ క్రియాశీల కార్యకర్తలు, యువ జనసైనికులు ఆకాంక్ష మేరకు పోటీ చేస్తున్నట్లు ఓ పక్రటన విడుదల చేశారు. ఆ మేరకు పార్టీ నేతలు ఎన్నికలపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే రోజుల వ్యవధిలోనే జనసేన అధినేత తన నిర్ణయాన్ని మార్చుకుని, బీజేపీకి మద్ధతు ప్రకటించడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp