Ganta -చంద్ర‌బాబు ఏడ్చినా ప‌ట్టించుకోని గంటా.. ఇక ఆశలు వదులుకోవడమేనా ?

By Kalyan.S Dec. 07, 2021, 08:15 am IST
Ganta -చంద్ర‌బాబు ఏడ్చినా ప‌ట్టించుకోని గంటా.. ఇక ఆశలు వదులుకోవడమేనా ?

గంటా శ్రీ‌నివాస‌రావు రాజ‌కీయంగా అజ్ఞాతంలో ఉన్నారు. కానీ అక్టోబ‌ర్ లో రాజమండ్రి అల్లు రామ‌లింగ‌య్య విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌కు విచ్చేసిన చిరంజీవి వెంట గంటా ఉన్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఆ సంగ‌తి అలా ఉంచితే.. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే అయి కూడా అధినేత చంద్ర‌బాబు ఏడ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న స్పందించ‌లేదు. రాజ‌కీయాల‌కు అతీతంగా కూడా కొంద‌రు ఆయ‌న‌ను ఓదార్చితే.. గంటా శ్రీ‌నివాస‌రావు అప్పుడు కూడా బాబుకు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌లేదు. ఆయ‌న‌కు ఎందుకంత మౌనంగా ఉన్నార‌నే దానిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఆయ‌న ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ విజ‌యం ఖాయ‌మ‌న్న సెంటిమెంట్ కూడా ఉంది. అయిన‌ప్ప‌టికీ అధికార పార్టీ వైసీపీ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో బీజేపీలో చేరుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చినా అదీ జ‌ర‌గ‌లేదు. అలాగ‌ని టీడీపీలోనే ఉన్నారా అంటే ఉన్న‌ట్టు లేదు.. అలాగ‌ని లేన‌ట్టూ లేదు. తొలిసారి 2019 ఎన్నికల్లో గంటా సెంటిమెంట్ బ్రేక్ కావ‌డంతో ఆయ‌న రాజ‌కీయ వేగం కూడా త‌గ్గిపోయింది. నిజానికి గంటా 2019 ఎన్నికల ఫలితాలను కూడా ముందే అంచనా వేశారు అంటారు. ఏపీలో వైసీపీ పవర్ లోకి వస్తుందని జగన్ సీఎం అవుతారని గంటా పక్కాగా ఎస్టిమెంట్ చేశారు .అయితే ఆయన వైసీపీలో చేరాలనుకునేలోగా ఆయన మిత్రుడు అవంతి శ్రీనివాసరావు వెళ్లి బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నారు. మొత్తానికి టీడీపీలో ఉన్న గంటా అక్కడ గెలిచారు. కానీ ఆయన అనుకున్నట్లుగానే పార్టీ ఓడింది అన్న వారూ ఉన్నారు.

టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టికీ గంటా రెండున్నరేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆయన కంప్లీట్ గా సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. విశాఖ సిటీలో పార్టీ పడకేసినా ఆయన పట్టనట్లుగా ఉన్నారు. ఈ మధ్యన వైసీపీ నేతలు చంద్రబాబు ఫ్యామిలీ మీద కొన్ని కామెంట్స్ చేశారని ఆయన కంట నీరు పెట్టుకున్నారు. ఆ ఎపిసోడ్ లో దేశమంతా బాబుకు సానుభూతి తెలిపినా గంటా మాత్రం మౌనంగానే ఉన్నారు. ఇంకో వైపు ఆయన అడుగులు ఎపుడూ పార్టీకి భిన్నంగానే సాగుతూ వచ్చాయి. గంటా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసి టీడీపీ పెద్దలకే షాక్ ఇచ్చారు. ఆ తరువాత ఆయన తన రాజీనామాను ఆమోదించుకోవాలని కూడా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ని స్వయంగా కలసి వచ్చారు. అయితే ఆయన రాజీనామా ఆమోదం కాలేదు. ఆయన ఇప్పటికీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయితే అసెంబ్లీకి రావడం లేదు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరి ఇవన్నీ చూసిన వారికి గంటా టీడీపీలో ఉన్నారా అన్న చర్చ వ‌స్తోంది.

దీనికి స‌మాధానంగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇటీవ‌ల వ్యంగ్యంగా స్పందించారు. ఒక చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గంటా పార్టీలో లేరా అలా అని మీరు అంటే నాకూ అనుమానం వచ్చింది అని సెటైరికల్ గా అన్నారు. ఈ సమాధానం గంటా వర్గానికి మంట పుట్టించేలా ఉంది. గంటాకు ఒంట్లో బాగోలేక‌పోవ‌డం వ‌ల్లే కొంతకాలంగా పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్నారని చెబుతూనే ఇలా స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతానికి టీడీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ గంటా శ్రీ‌నివాస‌రావు సైలెంట్ మోడ్ లో ఉండ‌డంతో ర‌క‌ర‌కాల ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి.

Also Read : Chandrababu, OTS - ఓటీఎస్‌పై బాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp