రైతులకు అండగా తొలి కిసాన్ రైలు

By Voleti Divakar Aug. 07, 2020, 03:30 pm IST
రైతులకు అండగా తొలి కిసాన్ రైలు

కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. మొన్నటి వరకు రోడ్డు, రైలు రవాణా స్తంభించపోవడంతో నిత్యావసరాల సరఫరా కూడా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను మార్కెట్లు, డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సరఫరా చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ఈ దుస్థితిని నివారించేందుకు రైల్వేశాఖ పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా దేశంలోనే తొలిసారిగా రైతులు ఉత్పత్తి చేసిన పంటలు, ఇతర ఉత్పత్తులను రవాణా చేసేందుకు దేశంలోనే తొలిసారిగా కిసాన్ రైలును ఈ రోజు ప్రారంభించింది.

కరోనా సమయంలో దేశ రాజధానితో పాటు, ఉత్తరాది రాష్ట్రాల్లో పిల్లలకు పాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ రేణిగుంట నుంచి డిల్లీ సమీపంలోని హజరత్ నిజాముద్దీన్ వరకు ప్రత్యేకంగా పాలతో కూడిన దూద్ దురంతో రైలును నడుపుతోంది. ఈ రైలు 36 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకున్నారు.

రైతులు పండించిన కూరగాయలు, పువ్వులు, పండ్లు, ఇతర ఉత్పత్తులు పాడైపోకుండా సకాలంలో, తక్కువ వ్యయంతో మార్కెట్లకు తరలించి, విక్రయించుకునేందుకు వీలుగా కిసాన్ రైలును ప్రారంభిస్తోంది. ఈ రైలును వారానికి ఒకసారి మహారాష్ట్రలోని దేవ్ లీ నుంచి బీహార్‌లోని దానాపూర్ వరకు నడపనున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈరైలును వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ప్రారంభించారు. రైల్వేశాఖ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ రైలును నడుపుతున్నారు. ఇప్పటికే సరుకుల రవాణాకు కార్గో ఎక్స్ ప్రెస్ రైలును కూడా రైల్వేశాఖ నడుపుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp