ఏపీ అప్పులు.. అసలు నిజాలు..

By Surya.M Mar. 30, 2021, 01:41 pm IST
ఏపీ అప్పులు.. అసలు నిజాలు..

ఇప్పుడు ఏ సామాజిక మాధ్యమం చూసిన ఒక దాని గురించే చర్చ సాగుతుంది. అదే చంద్రబాబు నాయుడు వైసిపి పాలనలో చేసిన అప్పుల గురించి చేస్తున్న విమర్శలపై నెటిజన్లు వంగ్యబాణాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి కేవలం 100 కోట్లతో పాలన వైసీపీ కి అప్పగించడం పైనే చర్చ సాగుతుంది. అసలు చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉంది అనే దానిపై అందరూ సామాజిక మాధ్యమాల్లో వెతుకులాట మొదలుపెట్టారు. దీంతో అసలు నిజం ఏంటనేది తేటతెల్లమైంది.

చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన అప్పుల కుప్ప గురించి అందరికీ తెలిసింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచింది చంద్రబాబేనని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో టిడిపి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అసలు ఈ అప్పుల గురించి ఒకసారి పరిశీలిస్తే అసలు విషయం తేటతెల్లమవుతోంది.

గత పాలకుల తరహాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుండటం, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా నెరవేర్చి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇక చెప్పుకునేందుకు ఏమీ లేక టీడీపీ నేతలతో పాటు కొన్ని పత్రికలు హఠాత్తుగా రాత్రికి రాత్రే అప్పులు పెరిగిపోయినట్లు కట్టు కథనాలు అల్లుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.

నిజానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో 5 ఏళ్ళు ఎంత ఆర్ధిక క్రమశిక్షణ పాటించారో రాష్ట్రం మొత్తం చూసింది. దేశంలో ఏ రాష్ట్రం చెయని విధంగా అత్యంత ప్రమాదకరమైన నిర్ణయాలతో రాష్ట్రాని అప్పుల ఊబిలోకి నెట్టిన విషయం ఇంకా రాష్ట్రం మర్చిపోయి ఉండదు. ఆ ప్రతిఫలమే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నడు చూడని ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ఎన్నికల అనంతరం ఈనాడు పత్రికలోనే రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు మాత్రమే మిగిలాయి అని జీతాలకు పెన్షన్లకు 5వేల కోట్లు, వృద్ధాప్య పించన్లకు 1200 కోట్లు అవసరం అవుతాయని ఈ పూట గడవాలంటేనే మొత్తం 6,200 కోట్లు అవసరం అని రాసింది. అలాగే గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే అన్నిచోట్ల నుండి మేము అప్పులు తెచ్చేశామని, ఇక జగన్ కి అప్పులు పుట్టే అవకాశమే లేదని బహిరంగంగానే చెప్పుకొచ్చారంటే గత పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఎంత ప్రమాద పరిస్థితుల్లోకి నెట్టారో అర్ధం చేసుకోవచ్చు.

Also Read : గోరంట్ల నోటా జూనియర్ ఎన్టీఆర్ మాటే !

కట్టలు తెగిన ఆర్ధిక క్రమశిక్షణ..

2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే నాటికి ఉమ్మడి రాష్ట్ర అప్పు - లక్షా 66 వేల కోట్లుగా తేల్చారు. రాష్ట్ర జనాభా ప్రకారం 58% ఆంధ్ర ప్రదేశ్, 42% తెలంగాణకు అప్పుని విభజించగా, ఆంధ్ర ప్రదేశ్ 13 జిల్లాల భాగానికి 96 వేల కొట్ల అప్పుని పంచారు. 96 వేల కోట్లతో ప్రారంభమైన నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగా, 2019 ఎన్నికల్లో ఆయన దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 96వేల కోట్ల నుండి 3.65 లక్షల కోట్లుకు చేర్చారు. నిజానికి ఆంధ్రప్రదేశ రాష్ట్రం అప్పుల ముప్పులో ఉందని 2016 లోనే కాగ్ ( కంట్రొలర్ అండ్ ఆడిట్ జనరల్) తన నివేదికలో హెచ్చరించింది. రాష్ట్రంలో అప్పులు ఆదాయం మధ్య సమతుల్యం తప్పుతుందని హెచ్చరించింది కూడా.

58 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో మన వాటాకి వచ్చిన అప్పు 96వేల కోట్లు అయితే, 2014 నుండి 2019 వరకు 5 ఏళలో చంద్రబాబు 3.65 లక్షలకోట్లు అప్పు చేసి వెళ్ళారు. అంటే రాష్ట్రంలో సగటు మనిషి నెత్తి మీద 42,500 భారం మోపి వెళ్ళారు. మాట్లాడితే సంపద సృష్టించా అని చెప్పుకునే చంద్రబాబుని అంత డబ్బుని ఏం చేశారు అని అడిగితే ఇప్పటికి ఆయన నుండి సమాధానం దొరకదు.

అప్పుల్లోనూ దుబారా..

ఒక పక్క చంద్రబాబు చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుంటే, ఇవేవి పట్టనట్టు ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా, నాటి తన పాలనలో చేసిన దుబారా ఖర్చు అంతా ఇంతాకాదు. ఎన్నికలకి ముందు రోజు కూడా 5వేల కోట్లు అప్పు చేసి పసుపు కుంకుమ తాయిలాలు ఎరచూపారు. చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపనలు, తాత్కాలిక నిర్మాణాలు పేరుతొ కోట్లు ఖర్చుపెట్టారు. ప్రత్యేక విమానాలు, రైన్ గన్లు, రాజధాని డిజైన్లు అని సింగపూరుకి, జపాన్ కి డబ్బు ఇచ్చి, మళ్ళీ వేరే సంస్థకి అప్పచెప్పి, అదీ నచ్చక రాజమౌళి లాంటి సినిమా డైరెక్టర్ ని డిజైన్ల విషయంలో కలవమని ఆ సదరు సంస్థకి చెప్పుకొచ్చారు. సుమారు 7 వేల కోట్ల ఖర్చుతో పుష్కరాలు నిర్వహించామని చెప్పారు.

Also Read : ఆత్మాభిమానం నుంచి పుట్టి.. ఆత్మనే మట్టుబెట్టి..

ఇలాంటి అస్తవ్యస్త విధానాలతో అనాలోచిత నిర్ణయాలతో విసిగిపొయిన జపాన్ కి చెందిన "మాకి ఆర్కిటెక్ సంస్థ" తన మేగజైన్ లో ఇక్కడ జరుగుతున్న విషయాలు చెప్పి పరువు తీసింది. ఒక పక్క ఆర్ధిక లోటు ఉంటే ఇలా విచ్చలవిడిగా అనవసర ఖర్చులు చేయటం సీనియర్ ఎకనామిస్ట్ ని అని చెప్పుకునే చంద్రబాబు గారికే చెల్లింది.

చంద్రబాబు గత పాలనా అప్పుల కుప్పలే..

చంద్రబాబు 9 ఏళ్ళ పాలన చూసుకున్నా ఇదే ఆర్ధిక లోటులో ఉమ్మడి రాష్ట్రం కొట్టుమిట్టాడింది. 1995 లో వైశ్రాయి ఘటనతో రామారావు ముఖ్యమంత్రి కుర్చి కోల్పోయి,చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే సమయానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆదాయం 13 వేల 100 కోట్లు ఉంటే ఖర్చులు 14 వేల 800 కోట్లుగా ఉంది. బడ్జెట్ లోటు 1700 కోట్లు ఇది బాబుగారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే సమయానికి 1995 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి. బాబు 9ఏళ్ళు పాలించి దానిని ఆయన దిగిపొయే నాటి ఆదాయం 26,869 కోట్లు గా, ఖర్చులు 35,575 కోట్లుగా చేశారు. ఇక 2004లో దిగిపోయే నాటికి 8,706 కోట్లు బడ్జెట్ లోటుతో వై.యస్ కి అప్పచెప్పారు చంద్రబాబు.

2004 నుండి 2009 దాక పాలించిన వై.యస్ దీనిని ఆదాయం 62 వేల 858 కొట్లు , కర్చులు 61 వేల 854 కోట్లు చేసి లోటులో ఉన్న బడ్జెట్ ని మిగులులోకి తెచ్చారు ( మిగులు బడ్జెట్ 1004 కోట్లు ) అలాగే చంద్రబాబు 9 ఏళ్ల హయాంలో, 99 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కి వెలితే వై.యస్ ఒక్క రోజు కూడా వెళ్లలేదు. మళ్లీ 2014 తరువాత చంద్ర బాబు హయాంలోఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్ళటం కనిపించింది.

చంద్రబాబు హయాం (1995 నుండి 2004) వరకూ చూసినా, (2014 నుండి 2019) వరకు చూసినా ఆంధ్రప్రదేశ్ ఖజానాలో అప్పుల కుప్ప తప్ప వేరేది కనిపించలేదు. రాష్ట్రాన్ని ఇంత దారుణమైన అప్పుల ఊబిలోకి నెట్టి, వైసిపి 20 నెలల పాలనలో అమలు జరుగుతున్న ప్రధకాలను ప్రస్తావించకుండా.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పటం చంద్రబాబుకే చెల్లింది. అప్పుల సామ్రాట్ గా పేరొందిన చంద్రబాబు అప్పుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం గా ఉందని రాష్ట్రానికి చెందిన ఆర్ధిక నిపుణులు చెప్పటం గమనార్హం.

Also Read : టీడీపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్న మాజీ మంత్రికి కరోనా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp