కూన ఓవర్ యాక్షన్

By Phani Kumar May. 25, 2020, 02:26 pm IST
కూన ఓవర్ యాక్షన్

తెలుగుదేశంపార్టీ హయాంలో విప్ గా పనిచేసిన ఆముదాలవలస మాజీ ఎంఎల్ఏ కూన రవికుమార్ చాలా ఓవర్ చేస్తున్నట్లే ఉంది. అధికారంలో ఉన్నపుడు ప్రజా ప్రతినిధులు లేకపోతే నేతల ఓవర్ యాక్షన్ చేశారంటే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. అధికారంలో ఉన్నపుడు కొందరు ఓవర్ యాక్షన్ చేయటం మామూలే. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే దూకుడుగా వెళుతున్నాడంటే ఏమిటర్ధం ?

తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో ఓ చెరువులో అక్రమంగా మట్టి తీస్తున్న కూన అనుచరులను ఎంఆర్వో అడ్డుకున్నాడు. అలాగే నాలుగు లారీలను కూడా సీజ్ చేశాడు. తర్వాత ఎంఆర్వో రామకృష్ణను కూన స్వయంగా ఫోన్ చేసి లంచం తీసుకుని వదిలేయమని బెదిరించాడు. పైగా లంచం కావాలా ? లేకపోతే ప్రాసెస్ చేసి కేసు పెడతావా ? అంటూ బెదిరించటం మరీ విచిత్రంగ ఉంది. లంచం తీసుకునేది లేదని ప్రాసెస్ చేసి కేసులు నమోదు చేస్తానంటూ ఎంఆర్వో సమాధానం చెప్పటంతో గొడవ మొదలైంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా కూన దూకుడు ఏమాత్రం తగ్గలేదు. అధికారంలో ఉన్నపుడు కూన ఓవర్ యాక్షన్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్దగా బయటకు రాలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా మాజీ ఎంఎల్ఏ బెదిరింపులు తగ్గకపోగా మరింత పెరగటంతో అధికారులు నిర్భయంగా ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో మాజీ ఎంఎల్ఏ ఓవర్ యాక్షన్ బయటపడుతోంది.

అధికారులను బెదిరించటం కూనకు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలామంది విలేజ్ అసిస్టెంట్లను, ఎంఆర్వోలను, రెవిన్యు అధికారులను బెదిరిస్తు కూన అడ్డంగా దొరికిపోయాడు. కూనపై ఇప్పటికే అనేక కేసులున్నాయి. ఓ కేసులో జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయినా ఈ మాజీ ఎంఎల్ఏ వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులపై ఇన్ని రకాలుగా దాడులకు పాల్పడుతున్న కూన వ్యవహారంపై చంద్రబాబునాయుడు కానీ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కానీ ఇంత వరకూ నోరు మెదపలేదు. మరి తాజా కేసులో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp