ఆ గ్రామాల్లో ఆనందం తెచ్చిన డ్రోన్లు !

By Voleti Divakar Oct. 17, 2020, 09:00 am IST
ఆ గ్రామాల్లో ఆనందం తెచ్చిన డ్రోన్లు !

ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆపార్టీ అనుబంధ మీడియా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పట్టించుకునే నాధుడే లేరని విమర్శిస్తున్నారు. హుద్ హుద్ తుపాను సమయంలో విశాఖపట్నంలో నేను ఎలా పనిచేశానో గుర్తుందిగా...నేనుగానీ ఇప్పుడు అధికారంలో ఉంటేనా అంటూ | చంద్రబాబునాయుడు డాంబికాలు పలుకుతున్నారు. చంద్రబాబునాయుడు అనుబంధ మీడియా ఈవార్త వింటే ఎలా ప్రతి స్పందిస్తారో మరి. తన నియోజకవర్గంలో అధికారుల పనితీరును కనీసం టిడిపి మేధావిగా భావించే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడైనా గుర్తిస్తే బాగుంటుంది.

తుఫాను కారణంగా తుని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేగంగా స్పందించిన అధికారులు తుని రూరల్ మండలంలోని ఐదు గ్రామాల్లో మినహా మిగిలిన అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధ రించారు. పక్కనే ఉన్న ఏరు ఉధృతంగా పారుతుండటంతో గజ ఈతగాళ్లకు కూడా విద్యుత్ వైర్లు కలిపే అవకాశం లేకుండా పోయింది. దీంతో అధికారులు సృజనాత్మకంగా ఆలోచించి డ్రోన్ల సహాయంతో ఆ ఐదు గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో అప్పటి వరకు అంధకారంలో ఉన్న ఆ గ్రామాల ప్రజల ఆనందం వర్ణనాతీతం.

తుపాను, భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ వంటి మహానగరంలోనే గత మూడు రోజులుగా విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను తిట్టిపోస్తున్నారు. ఎపిలో పరిస్థితి మరీ అంత దారుణంగా లేదన్నది వాస్తవం. పంటలు తీవ్రంగా దెబ్బతిన్న మాట కూడా అంతే వాస్తవం. తాజాగా తుపాను కారణంగా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే విద్యుత్ శాఖకు సుమారు రూ. 2కోట్ల నష్టం సంభవించింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, టవర్లు దెబ్బతీని, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అధికారులు వేగంగా స్పందించి పరిస్థితిని బట్టి కొన్నిచోట్ల 12గంటల లోపే విద్యుత్ సరఫరాను పునరుద్ధ రించడం విశేషం. లోతట్టు ప్రాంతాలు, వాగులు, నదుల తీరాన ఉన్న గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధ రించేందుకు కాస్త కష్టపడాల్సి వచ్చింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp