టిడిపి హిందుత్వాన్ని భుజానికెత్తుకుందా..?!

By Voleti Divakar Sep. 15, 2020, 01:30 pm IST
టిడిపి హిందుత్వాన్ని భుజానికెత్తుకుందా..?!

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఆపార్టీ విధానంలో ఇంతలోనే ఇంత మార్పా?. ఇది ప్రజలను ఆశ్చర్యానికి, ఆనుమానాలకు గురిచేస్తోంది. మైనార్టీ ఓట్లను పణంగా పెట్టి టిడిపి హిందుత్వాన్ని భుజానికెత్తుకుందా ఆన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో టిడిపి హిందుత్వ పార్టీగా గుర్తింపు పొందిన బిజెపిని మించిపోయినట్లు కనిపిస్తోంది.

ఆంతర్వేదిలోని చారిత్రాత్మక శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథం ఇటీవల దగ్ధమైంది. ఈ సంఘటనకు వ్యతిరేకంగా హిందుత్వ సంస్థలు, బిజెపి-జన సేన పార్టీ శ్రేణులతో పాటు, టిడిపి కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు. రథం దగ్ధంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిబిఐ విచారణకు ఆదేశించడంతో బిజెపి, జన సేన పార్టీలు కాస్త నెమ్మదించాయి. ఆయా పార్టీలు, సంస్థలు సిబిఐ విచారణ హామీతో తాత్కాలికంగా ఆందోళనలను విరమించాయి.

ఆయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలయాల వద్ద ఆందోళనలు కొనసాగించడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. రాజనుహేంద్రవరంలో గత కొన్ని రోజులుగా వివిధ ఆలయాల వద్ద హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టాలని, ఆంతర్వేది రథం దగ్ధం కేసులో దోషులను ఆరెస్టు చేయాలన్న డిమాండ్తో ఈ ఆందోళనలు సాగుతున్నాయి.

హిందుత్వను బిజెపి నుంచి దూరం చేసేందుకు టిడిపి విఫలయత్నం చేస్తోందా...లేక హిందుత్వానికి మద్దతు పలికి బిజెపిని ఆకట్టుకునేందుకు
ఆందోళనలు కొనసాగిస్తోందా? అనే చర్చ సాగుతోంది.

గోద్రా అల్లర్ల తరువాత మైనార్టీ ఓట్లను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్రమోడీని, అమిత్ షా ను తీవ్రంగా విమర్శించిన చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల్లో వారి పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించిన సంగతి తెలిసిందే. బిజెపి మళ్లీ ఆధికారంలోకి రాదన్న నమ్మకంతో గత ఎన్నికలకు ముందు మళ్లీ తెగతెంపులు చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఎన్నికల తర్వాత మళ్ళీ బిజెపికి దగ్గరయ్యేందుకు బాబు పడరాని పాట్లు పడుతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బాబును మించినవారు లేరన్నది ఎంతైనా వాస్తమనే మాటలు వినిపిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp