నాగుబాబుకు షాక్ ఇచ్చిన పవన్.. హెచ్చరిక సోదరుడి గురించేనా ?

By Phani Kumar May. 23, 2020, 08:24 pm IST
నాగుబాబుకు షాక్ ఇచ్చిన పవన్.. హెచ్చరిక సోదరుడి గురించేనా ?

సోదరుడు కొణిదెల నాగుబాబుకే సోదరుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్ద షాకే ఇచ్చాడు. నాగుబాబు కేంద్రంగా ట్విట్టర్ వేదికలో చేసే కామెంట్లు విపరీతంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధిని హత్యచేసిన నాధూరమ్ గాడ్సే గురించి నాగుబాబు చేసిన కామెంట్లపై పెద్ద దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే. అలాగే మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యవహార శైలిపైన కూడా నాగుబాబు ట్టిట్టర్ వేదికగా చేసిన కామెంట్ కూడా వైరల్ అయ్యింది.

నిజానికి నాధూరామ్ గాడ్సే విషయంలో కానీ మంత్రి అవంతి విషయంలో కామెంట్ చేయాల్సిన అవసరమైతే నాగుబాబుకు లేదు. ఎప్పటి విషయాల్లో కెలుక్కోవటం అందరి చేత ట్రోలింగ్ చేయించుకోవటం నాగుబాబుకు అలవాటుగా మారింది. అనవసర విషయాలపై ట్వీట్లుపెట్టి నాగుబాబు ఎందుకు కాంట్రవర్సీలు రేపుతున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ఇదే విషయమై పవన్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. నాగుబాబు చేసిన కామెంట్లతో జనసేనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పేశాడు. ఏ విషయం మీదైనా పార్టీ వైఖరిని అధికారికంగానే ప్రకటిస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు. కరోనా సంక్షోభం విషయంలో అవస్తలు పడుతున్న జనాలకు సేవ చేయటం వదిలేసి అనవసరమైన విషయాలపై మాట్లాడి కాంట్రవర్సీలు రేపాల్సిన అవసరం లేదని హెచ్చరించాడు. అనవసర విషయాలజోలికి వెళ్ళకుండా క్రమశిక్షణతో ఉండాలంటూ చేసిన హెచ్చరికలు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ హెచ్చరికలు చూసిన తర్వాత సోదరుడు నాగుబాబును పరోక్షంగా హెచ్చరించినట్లే అని భావిస్తున్నారందరూ.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp