రైతుల‌పై నిజంగా ప్రేముంటే..?

By Kalyan.S Aug. 04, 2020, 02:09 pm IST
రైతుల‌పై నిజంగా ప్రేముంటే..?

మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఏమైనా పెద్ద ఉప‌ద్ర‌వం వ‌చ్చి ప‌డిందా..? మొత్తం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు న‌ష్టం క‌లుగుతోందా...? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న హ‌డావిడి చూస్తే.. చాలా మందిలో ఇదే సందేహం వ్య‌క్తం అవుతోంది. ఆయ‌న స్టేట్ మెంట్లు, భావోద్వేగ ప్ర‌క‌ట‌న‌లు అలా ఉన్నాయి మ‌రి. రాష్ట్రం విడిపోయి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని లేని అనాథ‌గా మారిన‌ప్పుడు కానీ... ఉమ్మ‌డి రాష్ట్రానికి చెందిన అత్య‌ధిక సంప‌ద హైద‌రాబాద్ లోనే ఉండిపోతుంద‌నీ ప్ర‌జ‌లంతా ఆవేద‌న చెందిన‌ప్పుడు కానీ... చంద్ర‌బాబు ఇంత‌లా వ్య‌వ‌హ‌రించ లేదు. ఆంధ్ర‌ప్రదేశ్ చ‌రిత్ర‌లో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ దిశ‌గా స‌రికొత్త అడుగులు ప‌డుతున్న సంద‌ర్భంలో చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి మెజార్టీ ప్ర‌జ‌లకు ఆశ్చ‌ర్యమూ, ఆవేద‌న‌నూ క‌లిగిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఎందుకంటే మూడు రాజ‌ధానుల వ‌ల్ల అటు జ‌గ‌న్ కు వ్య‌క్తిగ‌తంగా క‌లిసొచ్చింది లేదు. కానీ.. ఇటు చంద్ర‌బాబు అండ్ కో మాత్రం మహా ఉపద్రవం జరిగిపోయినట్లే స్పందిస్తోంది. నిజం చెప్పాలంటే అమరావతి ప్రాంత రైతులకు కొంత న‌ష్టం జ‌ర‌గొచ్చు. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఓ ప్రాంతం న‌ష్ట‌పోతుంద‌ని భావిస్తే.. రైతుల‌కు న్యాయం జ‌ర‌గాలని ఆశిస్తే వారిని రెచ్చ‌గొట్ట‌డం కాదు.. ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రిపి త‌గిన స‌హాయం అందేలా చేయాలి.

ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను ప‌రిశీలిస్తే...

రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ప‌రిశీలిస్తే అమ‌రావ‌తి అభివృద్ధికి కూడా ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ప‌నిచేస్తోంద‌ని తెలుస్తుంది. శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తి అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు సుస్ప‌ష్టం అవుతుంది. సీఆర్ డీఏ ర‌ద్దు అయిన వెంట‌నే.. అమ‌రావ‌తి మెట్రో పాలిట‌న్ రీజియ‌న్ డ‌వ‌ల‌ప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు ఏఎంఆర్‌డీఏను నోటిఫై చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏఎంఆర్‌డీఏకు క‌మిష‌న‌ర్‌ను కూడా నియ‌మించింది. ఈ ఒక్క అంశం ప‌రిశీలిస్తే అమ‌రావ‌తి అభివృద్ధికి సీఎం జ‌గ‌న్ కృషి చేస్తున్నార‌ని, ఆ ప్రాంతంపై ఆయ‌న‌కు ప‌గ కానీ.. మిగిలిన ప్రాంతాల‌పై అధిక‌మైన ప్రేమ కానీ లేకుండా స‌మ న్యాయం పాటిస్తున్నార‌ని అర్థం అవుతుంది. చాలా మంది రైతులు కూడా వీటిని అర్థం చేసుకుంటున్నారు.

రైతుల్లో అల‌జ‌డి పెంచేలా...

మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మా..? తాడోపేడో తేల్చుకుందామంటూ.. చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు రైతుల‌ను ఆందోళ‌న‌కు గురి చేసేలా ఉన్నాయి. మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌తో కొద్దో గొప్పో ప్ర‌భావం ప‌డే అమరావతి ప్రాంత రైతులు తప్ప మరెక్కడా దీనిపై వ్య‌తిరేక‌త లేదు. ఎక్క‌డా ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌డం లేదు. . రాజధాని అంశంతో భావోద్వేగ బంధం ఉందో లేదో కానీ బాహాటంగా అయితే కనిపించలేదు. కానీ టీడీపీ మాత్రం దీన్ని రాజ‌కీయంగానే భావిస్తుంద‌నేది స్ప‌ష్టం అవుతోంది. దీనివ‌ల్ల రైతులు మ‌రింత న‌ష్ట‌పోయే అవ‌కాశాలు ఉన్నాయి. నిజంగా రైతుల‌పై ప్రేముంటే వారి ప‌క్షాన ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రిపే ప్ర‌య‌త్నాలు చేయాలి. గ‌తంలోనే సీఎం జ‌గ‌న్ ఆ ప‌ని చేశారు. రైతుల‌కు త‌గిన భ‌రోసా ఇచ్చారు. అలాగే ప్ర‌భుత్వం రైతుల కోసం చేయాల్సిందంతా చేస్తోంది. అమ‌రావ‌తి కి భూములు ఇచ్చిన రైతుల‌కు సంబంధించి కూడా స‌రైన నిర్ణయం తీసుకుంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp