వైద్యో నారాయణో రాధాకృష్ణ

By Voleti Divakar Sep. 15, 2020, 07:00 pm IST
వైద్యో నారాయణో రాధాకృష్ణ

పూర్వం వైద్యుడ్ని భగవంతుడితో సమానంగా చూసేవారు. నేటి కాలంలో ఆలాంటి వైద్య నారాయణులు డాక్టర్ మొవ్వా రాధాకృష్ణలా అరుదుగా కనిపిస్తారు. వైద్యవృత్తి వ్యాపారంగా మారి, కార్పొరేట్ స్థాయిలో ఉన్న ప్రస్తుత కాలంలో కూడా మొన్నటి వరకు రాధాకృష్ణ ఆతీతక్కువ ఫీజులతో వైద్యం అందించారు. ఆయన హస్తవాసి కూడా మంచిది కావడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఆయన పేరు, ఆయన స్థాపించిన ఆసుపత్రి విశేష ప్రాచుర్యం పొందడంతో పాటు, ప్రజల అభిమానాన్ని కూడా చూరగొన్నాయి.

రాధాకృష్ణ పేదల వైద్యుడిగా పేరొందారు. రాజమహేంద్రవరంలోని స్థానిక లలితానగర్ లో డాక్టర్ మొవ్వా రాధాకృష్ణ, డాక్టర్ వేదమణి దంపతలు చైతన్య నర్సింగ్ హోమ్ పేరిట సుమారు 3 దశాబ్దాల క్రితం ఆనువత్రిని నెలకొల్పారు. రాధాకృష్ణ జనరల్ సర్జన్ గా, ఆయన సతీమణి వేదమణి గైనకాలజిస్టుగా వైద్యసేవలు ప్రారంభించారు.
అప్పటికే వైద్యవృత్తి వ్యాపారంగా మారిన పరిస్థితుల్లో రాధాకృష్ణ దంపతులు వైద్య చికిత్సకు తక్కువ ఫీజు తీసుకోవడంతో పాటు, తక్కువ ధరలో నాణ్యమైన మందులు సిఫార్సు చేసేవారు. దీంతో కొద్దికాలంలోనే చైతన్య ఆసుపత్రి ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల రోగులు, గర్భిణీలకు ఆసలైన చిరునామాగా నూరింది.

నేటి వైద్యులకు పూర్తి భిన్నంగా ఎప్పుడూ చిరునవ్వుతో చలాకీ కనిపించే రాధాకృష్ణ రోగుల తాకిడితో ఎంత బిజీగా ఉన్నా సామాజిక సేవలో కూడా ముందు వరుసలో ఉండేవారు. మరో ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోలి రానూరావు ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ ద్వారా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. తన ఆభిరుచులకు అనుగుణంగా విద్యాసంస్థను కూడా రాధాకృష్ణ నిర్వహిస్తున్నారు. అలాగే ఒక వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

సేవానిరతికి నూరుపేరుగా నిలిచిన మొవ్వా రాధాకృష్ణ వంటి వారు వైద్య సమాజంలో ఆరుదుగా కనిపిస్తారు. ఆయన లాంటి వారి వల్లే ఇప్పటికీ వైద్యరంగం పట్ల ప్రజల్లో కాస్తయినా గౌరవం కొనసాగుతోంది. రాధాకృష్ణ హఠాన్మరణం చెందడం నైద్యరంగానికి, పేద, మధ్యతరగతి వర్గాలకు తీరనిలోటనడంలో సందేహం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp