Chandrababu Naidu - డామిట్ కథ అడ్డం తిరిగిందే?

By Balu Chaganti Oct. 21, 2021, 03:15 pm IST
Chandrababu Naidu - డామిట్ కథ అడ్డం తిరిగిందే?

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన ప్లాన్ విఫలం అయిందా? తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచడన్న చందాన చంద్రబాబు ప్లాన్ చేసింది ఒకటైతే ఇప్పుడు జరుగుతోంది మరోటిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2019లో ప్రమాణస్వీకారం చేసిన జగన్ అప్పటి నుంచి తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల సంక్షేమానికే అనే విషయాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు.. అందుకే ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని విజయాన్ని మళ్ళీ కట్టబెట్టారు.. ఈ ఫలితాలతో భవిష్యత్తులో పార్టీ నడపడం కూడా కష్టమైపోతుంది అనే భావనతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు.. అందులో భాగంగానే పట్టాభి లాంటి ఊరు పేరు లేని వ్యక్తులను తెరమీదకు తీసుకొచ్చి అధికార ప్రతినిధి హోదాలు ఇచ్చి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను ఎవరికీ అర్థం కాని భాషలో బూతులు తిట్టిస్తున్నారు.

అలా ఆరోపణల విషయంలో నక్కా ఆనందబాబుకు నోటీసులు జారీ చేసిన విషయం మీద ప్రెస్ మీట్ పెట్టిన పట్టాభి ఒకపక్క పోలీసులను మరోపక్క ముఖ్యమంత్రిని అలాగే క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించే వందలాది మందిని చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. పైపెచ్చు టీడీపీ అనుకూల మీడియాలో ఆ పదాలకు కనీసం బీప్ వాడాలన్న కామన్ సెన్స్ లేకుండా ప్రజల్లోకి వెళ్లేలా చేశారు.

ఇలాంటి బూతులు విన్న తరువాత వైసీపీ శ్రేణులకు కోపం రావడం సహజం. ఆ కోపంలో పెద్ద ఎత్తున టిడిపి ఆఫీసుల మీద దాడి జరిగితే దానిని స్వలాభం కోసం వాడుకుని రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది అనే విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే కుట్రలో భాగంగా ఇదంతా ప్లాన్ చేశారు. టీడీపీ ఆఫీసుల వద్ద నిరసన వ్యక్తం చేయాలి అని వైసీపీ శ్రేణుల్లో నిర్ణయం తీసుకోగా వాళ్ళు నిర్ణయం తీసుకునే సమయానికి తమ మీద దాడి జరగబోతోంది అంటూ పోలీసులకు ఫోనులు చేసినట్టు లోకేష్ చెబుతున్నారు. టిడిపి ప్రధాన కార్యాలయం మీద దాడి జరగడానికి పదిహేను నిముషాలు ముందే మేం పోలీసులకు ఫోన్ చేసాము అయినా పోలీసులు స్పందించలేదు అనేది లోకేష్ ప్రధాన ఆరోపణ.

Also Read : Kommareddy Pattabhi Ram - టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రత్యేకత ఏమిటీ?

అయితే దాడి జరగడానికి ముందే దాడులు జరుగుతున్నట్లు లోకేష్ ఊహించడం! ఫిర్యాదు చేయడంతో ఇదంతా ప్రీ ప్లాన్డ్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి పట్టాభి ఏదైతే పదం వాడాడో దానిని అసలు బూతే కాదు అని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పదం అర్థం ఏమిటో వివరించారు. వైయస్ జగన్ కూడా తనను దూషించటం కోసం మన వాళ్ళు కాదు అనుకున్న వాళ్లు అధికారంలో ఉంటే ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు జగన్ ఆవేదన ప్రజల్లోకి వెళ్తోంది కానీ చంద్రబాబు చేస్తున్న దీక్ష గురించి పెద్దగా వార్తలు రాకపోవడమే వారికి షాక్ గా మారింది. టీడీపీ అనుకూల మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ లో లైవ్ ఇస్తున్నారు. అయితే జనాల్లో చర్చ జరుగుతోంది మాత్రం జగన్ ఆవేదన గురించే.

తమ మీద దాడి జరిగింది అని చంద్రబాబు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు మాత్రం జగన్ను అంత మాట అనడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో మైలేజ్ పెంచుకోవడానికి జగన్ ను తిట్టించి దాడులు చేయించుకుంటే సరిపోతుందని చంద్రబాబు భావించారు కానీ అది ఇప్పుడు రివర్స్ తిరిగి జగన్ కి మైలేజ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుండడంతో చంద్రబాబు కథ అడ్డం తిరిగింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పట్టాభి అన్న మాటలు ఇంకా టీడీపీ శ్రేణులు సమర్ధించుకోవడంతో పార్టీకి మరింత మైనస్ అవడం ఖాయం.

Also Read : TDP Chandrababu - ఆ విధంగా ముందుకు పోతూనే ఉన్నారు..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp