Life Span Decreased - కరోనా ప్రభావం.. అంతకు మించి..

By Thati Ramesh Oct. 23, 2021, 05:00 pm IST
Life Span Decreased - కరోనా ప్రభావం.. అంతకు మించి..

పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి.. ఎందరో జీవితాలను అతలాకుతలం చేసింది. ఆరోగ్యపరంగా చూస్తే కోవిడ్ సోకి తగ్గిన తర్వాత కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారు. వివిధ స్థాయిల్లో కరోనా కారణంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారే. కొవిడ్ సోకిన కారణంగా భారతీయుల జీవితకాలం కూడా తగ్గినట్లు తాజా పరిశోధనలు పేర్కొంటున్నాయి. సగటున దాదాపు రెండేళ్ల ఆయుర్ధాయం తగ్గినట్లు ‘‘ఇంటర్నేషనల్ ఇన్సిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్(IIPS)’’ తన నివేదికలో వెల్లడించింది.

కరోనా కారణంగా ఆడ, మగవారిలో సగటున రెండేళ్ల ఆయుష్షు తగ్గినట్లు BMC పబ్లిక్ హెల్త్ జర్నల్ లో IIPS సంస్థ ఈ విషయాన్ని వెల్లడించారు. IIPS ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రిపోర్ట్ ను ప్రిపేర్ చేశారు. 2019లో పురుషుల జీవితకాలం 69.2ఏళ్లు కాగా, స్త్రీల్లో 72 ఏళ్లుగా ఆయుర్ధాయం ఉంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా జీవితకాలం రెండేళ్లు తగ్గడంతో పురుషుల సగటు ఆయుష్షు 67.5 ఏళ్లకు తగ్గగా, ఆడవారి జీవితకాలం 69.8 ఏళ్లకు పడిపోయినట్లు ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ టీమ్ పేర్కొంది. 2020లో కోవిడ్ కారణంగా 35 నుంచి 79 ఏళ్ల వయస్సున్న వారిలో ఎక్కువగా మరణాలు సంభవించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

‘‘ ఓ శిశుశు పుట్టిన సమయంలో సంభవించిన వివిద మరణాల గణాంకాల సగటు ఆధారంగా ప్రజల జీవితకాలాన్ని లెక్కిస్తారు. లెంత్ ఆఫ్ లైఫ్ ఇన్ఈక్వాలిటీ అనే అంశంపై కూడా పరిశోధన చేయగా, కరోనాతో చనిపోయిన39 నుంచి 69 ఏజ్ గ్రూప్ లో పురుషులే ఎక్కువ మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు’’.

గత దశాబ్ధకాలంలో ప్రజల ఆయుర్ధాయం పెంచడానికి చేసిన కృషి అంతా కరోనా కారణంగా తుడిచిపెట్టుకుపోయిందని ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంటువ్యాధులు ప్రబలిన ప్రతిసారి ప్రజల జీవితకాలం తగ్గిపోవడం సహజంగా జరుగుతుందని IIPS డైరెక్టర్ డాక్టర్ జేమ్స్ పేర్నొన్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : President Rule - పరిస్థితులతో పనిలేదు.. డిమాండ్ చేస్తాం అంతే..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp