హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా

By Kiran.G Aug. 02, 2020, 05:26 pm IST
హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా

దేశంలో కరోనా సామాన్యులకు మాత్రమే కాకుండా నాయకులకు సెలబ్రిటీలకు కరోనా సోకుతుంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి చెందగా, ఈరోజు ఉత్తరప్రదేశ్ మంత్రి కమలా రాణి కరోనాతో మృతిచెందారు. తాజాగా హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా సోకినట్లు అమిత్ షా వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించామని ఆ పరీక్షల్లో కరోనాగా తేలిందని అందుకే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని ట్విట్టర్ వేదికగా హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

"రోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారందరూ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరుతున్నాను"అని అమిత్ షా ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనను కలిసిన వారంతా హోమ్ క్వారెంటయిన్లో ఉండాల్సిందిగా అమిత్ షా విజ్ఞప్తి చేసారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp