గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్

By Kiran.G Aug. 05, 2020, 01:14 pm IST
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో ఉధృతంగా ఉన్న విషయం తెలిసిందే. సామాన్యులనే కాక నాయకులను సెలబ్రిటీలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలువురు నాయకులు,సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కొందరు నాయకులు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు కూడా. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక వీడియో ద్వారా తెలియజేసారు.

"గత రెండు రోజులుగా జ్వరం ,దగ్గుతో బాధపడుతున్నాను. వైద్య పరీక్షల అనంతరం కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంది. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. మీ అశీస్సులతో తొందరలోనే కోలుకుంటాను” అని ఎస్పీబీ వీడియోలో పేర్కొన్నారు.

గాన గంధర్వుడిగా పేరుపొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వైరస్ బారినుండి ఎస్పీబి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు..కాగాఇప్పటికే దేశంలో ప్రతీరోజు 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అవుతున్న విషయం తెలిసిందే.. నిన్న ఒక్కరోజులో 52,509 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా 857 మరణాలు సంభవించాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp