బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్

By Kiran.G Aug. 07, 2020, 12:15 pm IST
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల వ్యాప్తి అధికంగా ఉంది. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వాప్యారవేత్తలు కరోనా బారిన పడ్డారు.

తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా నిర్దారణ కావడంతో సీఎం రమేష్ హోం క్వారెంటయిన్ లోకి వెళ్లారు. ఇంటి వద్ద నుండే ఆయన చికిత్స పొందుతున్నారు. సీఎం రమేష్ ను కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు..

కాగా దేశవ్యాప్తంగా పలువురు బీజేపీ నాయకులకు ముఖ్యమంత్రులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉన్నారు. బీహార్ లో సుమారు 100 బీజేపీ నాయకులకు కరోనా సోకింది. దీంతో బిజెపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp