చీరాలలో తీవ్ర కలకలం

By iDream Post Mar. 29, 2020, 11:00 am IST
చీరాలలో తీవ్ర కలకలం

శనివారం ప్రకాశం జిల్లాలో రెండు కరొనా పాజిటివ్ కేసులు బయట పడడంతో జిల్లా వాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. ప్రకాశం జిల్లా చీరాల లోని సల్మాన్ పేట పంచాయితీ పరిధిలోని నావాబ్ పేటకు చెందిన భార్యా భర్తలు ఇరువురు కారొనా లక్షణాలు ఉండడంతో వారిని ఈనెల 26 న ఒంగోలు రిమ్స్ లొని కరొనా ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా వారికీ కరొనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఒక్కసారిగా చీరాల వాసులు ఉలిక్కిపడ్డారు.
వివరాల లోకి వెలితే చీరాల నవాబ్ పేట కు చెందిన షేక్ గౌస్ అనే వ్యక్తి డిల్లిలోని నిజాముద్దీన్ మర్కస్ మసీదు లో మత ప్రచార సభకు వెళ్లి ఈ నెల 13న జీటీ ఎక్స్ ప్రెస్ లో చీరాలకు వచ్చారు. అనంతరం అతను తన భార్యతో కలసి ఒంగోలు లోని తన కుమారుని వద్దకు వెళ్ళి ఈనెల 19 వరకు అక్కడే గడిపి తిరిగి ఈ నెల 19న చీరాల లోని స్వగృహానికి చేరుకున్నారు.

కాగా, ఈ దంపతులు ఇద్దరు రెండు మూడు రోజులు దగ్గు, జలుబుతో భాధపడుతున్నట్టు తెలిసింది. అయితే ఈనెల 25 న గౌస్ భార్యకి తీవ్రమైన జ్వరం రావడంతో స్థానిక ఏఎన్ఏం ఇచ్చిన సమాచారంతో 26 న చీరాల లోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. వీరికి కరొనా లక్షణాలు ఉండడం తో అనుమానంతో దంపతులిరువురిని ప్రత్యేక అంబులెన్సులో ఒంగోలు రిమ్స్ లో ప్రత్యేకంగా ఎర్పాటు చేసిన కరొనా వార్డు కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి వారి రక్త నమూనాలను తిరుపతి లోని కరొనా ల్యాబ్ కు తరలించగా వారికి పాజిటివ్ గా తేలింది. అనంతరం మరోసారి నివృత్తి చేసుకోవడానికి వారి శాంపిల్స్ ను పుణే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపించగా అక్కడ కుడా పాజిటివ్ అని తేలింది.

దీంతో హుటాహుటిన అధికారులు నావాబ్ పేట ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని ఈ దంపతులతో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించి వారిని ఒంగోలు రిమ్స్ లోని స్పెషల్ క్వారంటైన్ వార్డు కి తరలించారు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చీరాల మునిసిపల్ ఆఫీస్ లో అధికారులతో సమీక్ష్ సమావేశం నిర్వహించారు.

ఏది ఏమైనా ఇటీవలే ఒంగోలు లో లండన్ నుండి వచ్చిన వ్యక్తికి కరొనా పాజిటివ్ గా తేలడం, ఇప్పుడు మళ్లీ చీరాలకు చెందిన దంపతులుకు కొరొనా పాజిటివ్ గా తేలడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3 చేరుకోవడంతో జిల్లా వాసులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్తితుల్లొ లాక్ డౌన్ నిభందనలు కఠినతరం చెయ్యాలని వారు కోరుకుంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp