రాజ‌కీయ ప్ర‌ముఖుల‌పై పంజా : యూపీలో క‌ల‌క‌లం

By Kalyan.S Aug. 02, 2020, 10:27 pm IST
రాజ‌కీయ ప్ర‌ముఖుల‌పై పంజా :  యూపీలో క‌ల‌క‌లం

అవునా.. వాళ్లు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు..? అయినా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారా..? కార్పొరేట్ స్థాయి వైద్యం.. రాష్ట్ర మంత్రి నేప‌థ్యంలో ప్ర‌ముఖ వైద్య బృందం ప‌ర్య‌వేక్ష‌ణ అయినా ఆమెను కాపాడ‌లేక‌పోయాయి. ఆదివారం ఎక్క‌డా చూసినా ఇదే చ‌ర్చ‌. దేశ‌, రాష్ట్ర రాజ‌కీయాల‌ను క‌రోనా కుదిపేసింది... నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. మ‌హామ‌హులు క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశం మొత్తం మ‌హ‌మ్మారి మ‌రోమారు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కులు, పలువురు సినీ, క్రీడా సెల‌బ్రిటీల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కానీ ఆదివారం ఒక్క‌రోజే ఒక్క‌దానికొక‌టి వ‌రుస‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన వార్త‌లు అంద‌రినీ ఉలిక్కిప‌డేలా చేశాయి.

కొన్ని నిమిషాల్లోనే మ‌రో బ్రేకింగ్ న్యూస్...

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయిందని తెలిసిన కొన్ని నిమిషాల్లోనే మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. భన్వరీలాల్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు ఆస్పత్రి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. కావేరి ఆస్పత్రిలో ఆయనకు మరిన్ని చికిత్సలు చేస్తున్నారు. ఇన్‌ఫెక్షన్ తక్కువ స్థాయిలోనే ఉందని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.  ప్రస్తుతం ఆయన్ను హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆస్పత్రికి చెందిన వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి పరిశీలిస్తుందని కావేరి ఆస్పత్రి తెలిపింది.

యూపీలో టెన్ష‌న్‌...

కరోనాతో ఉత్తర్​ప్రదేశ్​ కేబినెట్​ మంత్రి కమలా రాణి వరుణ్​ మృతి చెంద‌డం ఆ రాష్ట్రంలో తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపింది. ముఖ్యంగా రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆందోళ‌ను గురి చేసింది. 15 రోజుల పాటు క‌రోనా పోరాడి కమలా రాణి ఓడ‌డంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వెంట‌నే అందుబాటులో ఉన్న మంత్రులు, ప్ర‌ముఖుల‌తో చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. మ‌హ‌మ్మారిగా మారిన క‌రోనాతో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp