ఏపీలో 793 మందికి కరోనా నిర్దారణ

By Kiran.G Jun. 29, 2020, 02:19 pm IST
ఏపీలో 793 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 793  మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 13,891 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  వెల్లడించింది. కాగా 6232  మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 7479 గా నమోదయింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 180 మంది మరణించారు.

గడచిన 24 గంటల్లో 302 మంది కోవిడ్19 నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 30216 శాంపిల్స్‌ పరీక్షించగా రాష్ట్రంలో 793 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp