ఢిల్లీలో ఎలక్ట్రిక్‌‌ వెహికల్‌‌ పాలసీని ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్‌‌

By Kiran.G Aug. 08, 2020, 02:22 pm IST
ఢిల్లీలో ఎలక్ట్రిక్‌‌ వెహికల్‌‌ పాలసీని ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్‌‌

దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్‌‌ వెహికల్‌‌ పాలసీని సీఎం కేజ్రీవాల్‌‌ ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ సేల్స్‌‌ను ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్‌‌ ఫీజు, రోడ్‌‌ట్యాక్స్‌‌రద్దు, కొత్త కార్ల కొనుగోలుకు రూ.1.5 లక్షల ఇన్సెంటివ్‌ ‌ఇస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో అమ‌లు చేయ‌నున్న విద్యుత్ వాహ‌నాల విధానాన్ని శుక్ర‌వారం ఆయ‌న విడుద‌ల చేశారు.

ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల వ‌ల్ల ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూర‌డంతో పాటు కాలుష్యం కూడా త‌గ్గించుకోవ‌చ్చ‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్ధిక వ్యవస్థని అభివృద్ధి చేసేందుకు, ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ పాలసీని ప్రారంభించామన్నారు.

విద్యుత్‌తో న‌డిచే ద్విచ‌క్ర వాహ‌నాలు, ఆటో, స‌ర‌కు ర‌వాణా వాహ‌నాల‌కు రూ.30 వేలు, ఎల‌క్ట్రిక్ కార్ల‌కు రూ.1,50,000 వ‌ర‌కు రాయితీ ఇస్తామ‌న్నారు. కేంద్రం ఇచ్చే రాయితీకి ఇది అద‌న‌మ‌ని కేజ్రీవాల్ తెలిపారు. ఈ పాలసీ ప్రకారం టూ వీలర్‌‌‌‌కొన్నవారికి రూ.30వేలు, ఆటోలు, ఈ–రిక్షాలు, సరుకు రవాణా చేసే వాహనాలకు సుమారు రూ.1.50లక్షల వరకు ఇన్సెంటివ్‌‌లు ఇస్తామని, ఎలక్ట్రిక్‌ ‌కమర్షియర్షిల్‌ ‌వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుందని చెప్పారు .

ఈ సంద‌ర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఈవిధానం మొత్తం ప్ర‌పంచంలో ఉన్న‌ మంచి విధానాల్లో ఒక‌ట‌ని చెప్పారు. ఇంధ‌నంతో న‌డిచే వాహ‌నాల నుంచి విద్యుత్ వాహ‌నాల‌కు మ‌ళ్ళిన వారికి రుణాల‌పై వ‌డ్డీ మాఫీతో పాటు, రిజిస్ట్రేష‌న్ రుసుము, రోడ్డు ట్యాక్స్ నుంచి మిన‌హాయింపు ఇస్తామ‌ని వివ‌రించారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన విద్యుత్ వాహ‌న పాల‌సీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల క‌ల్ప‌న‌కు దోహ‌ద‌ప‌డటంతో పాటు దేశ రాజ‌ధానిలో కాలుష్యం స్థాయిలు క్ర‌మంగా త‌గ్గుతాయ‌ని కేజ్రీవాల్ చెప్పారు. 

ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే ఆలోచనతో ముందుకెళ్తున్నాయి.ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అమల్లోకి తెచ్చిన ‘ఫేమ్‌-2’ను రాష్ట్రం అనుసరిస్తుందని స్పష్టం చేసింది. ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలని తెలంగాణ సర్కార్‌కు కూడా తాజాగా నిర్ణయించింది. ‘తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్‌ సొల్యూషన్‌ పాలసీ’ని కేబినెట్‌ ఆమోదించింది. కేంద్రం సూచించిన ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలను అమలు చేయనున్నామని ప్రకటించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp