నేడు నరసరావుపేటకు రానున్న సీఎం జగన్

By Rishi K Jan. 15, 2021, 07:51 am IST
నేడు నరసరావుపేటకు రానున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు నరసరావుపేటలో పర్యటించనున్నారు. కనుమ పండు పురస్కరించుకుని టీటీడీ, ఇస్కాన్‌ సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందులో భాగంగా నరసరావు పేటలోని మునిసిపల్ క్రీడా ప్రాంగణంలో జరగనున్న కామధేను పూజ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.

ముఖ్యమంత్రి నరసరావుపేట పర్యటన నేపథ్యంలో మునిసిపల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ సమీక్షించారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి 11.20 నిమిషాలకు నరసరావుపేటకు చేరుకోనున్నారు. మునిసిపల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లని పరిశీలించి గోపూజ కార్యక్రమంలో పాల్గొని తిరిగి మధ్యాహ్నం 1.10 నిమిషాలకు తాడేపల్లి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు హోం శాఖ మంత్రి సుచరిత, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp