సంక్రాంతి సంబ‌రాలు.. సంప్ర‌దాయాల‌ను ఒలికించిన జ‌గ‌న్

By Kalyan.S Jan. 14, 2022, 07:45 pm IST
సంక్రాంతి సంబ‌రాలు.. సంప్ర‌దాయాల‌ను ఒలికించిన జ‌గ‌న్

సంక్రాంతికి పెట్టింది పేరు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. ద‌క్షిణాది రాష్ట్రాల్లో అన్నింటి కంటే ఏపీలో పెద్ద పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు. సంక్రాంతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పిల్లా.. పెద్దా.. ప్ర‌ముఖులు.. సెల‌బ్రిటీలు.. రాజ‌కీయ నేత‌లు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ సంబ‌రాల్లో పాల్గొంటారు.

మెగా ఫ్యామిలీ వేడుక‌లు..

ఆ సంద‌ర్భంగా చిన్న పిల్లాడిలా చిరంజీవి చేష్ట‌ల‌కు సంబంధించిన వీడియో నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.ఎప్పటిలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇరువురు కలిసి భోగి వేడుకలు జరుపుకుంటున్న వీడియోను తాజాగా వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చిరు, వరుణ్ తేజ్‌ కలిసి దోసెలు వేస్తున్న సీన్ భలే ఫన్నీగా ఉంది. తన కంటే వరుణ్ వేసిన దోసె బాగా రావడంతో చిరు చిన్నపిల్లాడిలా అతనితో గొడవపడ్డారు. పాపం చిరు వేసిన దోసె పెనానికి అతుక్కుపోయింది. పక్కనే వరుణ్ వేసిన దోసె బాగా రావడంతో.. 'నాకు కుళ్లు వచ్చేసింది..' అంటూ చిరు చిన్నపిల్లాడిలా గొడవపడే ప్రయత్నం చేశారు. వరుణ్ వేసిన దోసెను గరిటెతో చెడగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఇద్దరి మధ్య సరదా గొడవ ఎంత క్యూట్‌గా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన కాసేపటికే లక్ష పైచిలుకు వ్యూస్‌తో ఈ వీడియో వైరల్‌గా మారింది.

అదిలా ఉండ‌గా.. సీఎం క్యాంప్ ఆఫీసులో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం జగన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూర్ణకుంభంతో అర్చకులు సీఎం దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎంజగన్. భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో దంపతులు ఇద్దరు కలసి పాల్గొన్నారు. చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలను చూసిన సీఎం దంపతులు వారిని మెచ్చుకున్నారు.

సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. సంక్రాంతి సంబారాల్లో పాల్గొనేందుకు వచ్చిన అక్కచెల్లెల్లకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాని అన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp