ఆ విషయంలో సీఎం జగనే కరెక్ట్...నిజం కఠినమైనదే... !

By Suresh May. 06, 2021, 09:46 am IST
ఆ విషయంలో సీఎం జగనే కరెక్ట్...నిజం కఠినమైనదే... !

కరోనా విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే అంశంలో, అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అంచనా వేస్తున్నప్పటికీ, ఫుల్ క్లారిటీతో ఉన్నది మాత్రం ఏపీ సీఎం జగన్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరెన్ని చెప్పినా కుండబద్దలు కొట్టినట్లు సీఎం జగన్ చెప్పినట్లే దేశంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలోనే సీఎం జగన్ కరోనా అనేది ఒక నెల రోజుల్లోనో, రెండు నెలల్లోనో పోయేది కాదని ఆయన చెప్పుకొచ్చారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని కాస్త కఠినంగానే చెప్పారు. ఆ సమయంలో అటు విపక్షాలు, కుహానా మేధావులు సీఎం వ్యాఖ్యలను తప్పు పట్టారు. కట్ చేస్తే ఇప్పటికి ఆయన ఆ వ్యాఖ్యలు చేసి దాదాపు ఏడాది కావొస్తోంది. సరిగ్గా ఇవే వ్యాఖ్యలు అటు ప్రధాని మోదీ, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఎందుకంటే గ్లోబల్ ప్యాండెమిక్ పరిస్థితులు ప్రస్తుత ఆధునిక సమాజానికి కొత్త అనుభవం, కానీ ఇలాంటి అనుభవాలు మానవాళి గతంలో కూడా ఎదుర్కొంది. శాస్త్రీయ అవగాహన, పుస్తక పఠనంతో పాటు, కొత్త ఆలోచనా విధానం వల్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితులను చక్కగా అంచనా వేయగలిగారు. అంతేకాదు, ఎందుకంటే గ్లోబల్ ఔట్ లుక్ పట్ల అవగాహన ఉంటే కానీ ఇలాంటి విషయాలు అంతగా అర్థం కావు. కానీ కఠోరమైన ఈ వాస్తవాలను ప్రజలను అర్థం చేయించడం అనేది నాయకులు చాలా కష్టం. కానీ జగన్ మోహన్ రెడ్డి ఓ పరిణితి చెందిన నాయకుడిగా ఇలాంటి విషయాలను ప్రజలకు సులభంగా అర్థం అయ్యేలా చెప్పేశారు.

ఇక వ్యాక్సిన్ విషయంలోనూ ఆయన వేసిన అంచనా కరెక్టుగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం హడావిడిగా వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పటికీ, 18 దాటిన వారందరికీ వ్యాక్సిన్ దక్కాలంటే కనీసం సెప్టెంబర్ అయినా పడుతుందని ఆయన అంచనా వేశారు. అందులో లాజిక్ కూడా ఉంది. ఎందుకంటే దేశంలో 18 సంవత్సరాలు దాటిన వయోజనులు దాదాపు 60 కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే కనీసం 120 కోట్ల డోసులు కావాల్సి ఉంటుంది. అంటే కనీసం సెప్టెంబరు తర్వాతే వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని, మొత్తం ప్రక్రియ పూర్తవ్వాలంటే కనీసం జనవరి అయినా పడుతుందని జగన్ అంచనా వేశారు. ఆయన అన్నట్లుగానే అంతా జరుగుతోంది. కేంద్రం హడావిడిగా వ్యాక్సినేషన్ ప్రారంభించినా అక్కడ సరిపడా వ్యాక్సిన్లు లేకపోవడమే, ఇందులో కొసమెరుపు. అయితే ఇలాంటి దార్శనికత నేతల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే జగన్ మాత్రం ఇలాంటి విషయాల్లో అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరమే మేలని ఉన్నది ఉన్నట్లు జనాలకు విడమర్చి చెప్పడంలో దిట్టగా నిలిచారు. నిజానికి నేతల జోల పాటల కన్నా, ఇలా కఠినమైన వాస్తవాలను ప్రజలకు విడమర్చి చెబితేనే మంచిదని విశ్లేషకుల అంచనాగా ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp