సీజేఐ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా?

By Kiran.G 13-11-2019 06:30 AM
సీజేఐ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా?

గత ఐదు రోజుల కింద అయోధ్య రామజన్మభూమి కేసులో చారిత్రాత్మిక తీర్పు ఇచ్చి నాలుగుదశాబ్దాల వివాదాన్ని పరిష్కరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజాన్ గొగోయ్ మరో నాలుగు రోజుల్లో 17వ తారీఖున రిటైర్ కాబోతున్నారు. అయోధ్య కేసు తరువాత మరో నాలుగు ముఖ్య కేసులలో రంజాన్ గొగోయ్ సారధ్యంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. 

ఈ రోజు కీలక కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఇవ్వనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం( సీజేఐ) సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా? రాదా?అనే కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వనుంది. సీజేఐ జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలో ఐదుగురు రాజ్యాంగ సభ్యుల ధర్మాసనం ఈ వ్యవహారంపై బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తీర్పు ఇవ్వనుంది 

సీజేఐ కార్యాలయం ఆర్ టి ఐ పరిధిలోకి వస్తుందని 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్ట్ సెక్రటరీజనరల్, కోర్టు కు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఏప్రిల్ 4న తీర్పును రిజర్వులో ఉంచింది. "పారదర్శకత లేని వ్యవస్థను ఎవరు కోరుకోరు, కానీ పారదర్శకత పేరుతో న్యాయవ్యవస్థను నాశనం చేయకూడదు" అని విచారణ ముగింపు సమయంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News