చంద్రబాబుకు చిత్తూరు ఎస్పీ క్లాస్

By Harinath.P Apr. 07, 2021, 04:21 pm IST
చంద్రబాబుకు చిత్తూరు ఎస్పీ క్లాస్

రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని అధికార పార్టీకి అంటగట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. కోవిడ్ విజృంభన సమయంలో హైదరాబాద్ లోని ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా .. ట్విటర్ నుంచి అబద్దాలు ప్రచారం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

రాష్ట్రంలో కొన్ని అసాంఘిక శక్తులు విగ్రహాలను ధ్వసం చేస్తూ మత రాజకీయాలు చేయడానికి ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే. రోజు ఎక్కడో చోటా, జనసంచారం లేని గుళ్లల్లో విగ్రహాలను ద్వంసం చేసి, టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు చేసిందీ చూశాము.

ఈ విగ్రహాల ద్వంసం వెనుక టీడీపీ నాయకులే ఉన్నారన్న సంగతి వెలుగు చూడగానే రాష్ట్ర మంతా విగ్రహాలపై దాడుల ఘటనలు ఒక్కసారిగా ఆగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో ఓ గుడిలో ఉన్న నందీశ్వరుణ్ని కొందరు బయటకు తీసుకొచ్చి రోడ్డుమీద ఉన్న దిమ్మెపై పెట్టేందుకు ప్రయత్నించారు.
సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. అది చేసింది తెదేపా నేత అచ్చెన్నాయుడు మనుషులే అని పోలీసుల విచారణలోనే వెల్లడైంది. ఇక, అప్పటి వరకు రాద్దాంతం చేసిన టీడీపీ నాయకులు తేలు కుట్టిన దొంగల్లా అలా సైలెంట్ అయిపోయారు.

Also Read : రాజకీయాల్లో ఆదర్శం అనుకుంటుండగానే.. ట్విస్ట్‌ ఇచ్చిన మాజీ హోం మంత్రి

తాజాగా, రెండు రోజుల కింద కుప్పం మండలం గొణుగూరు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవతా మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. దీనిపై నిజానిజాలు తెలుసుకోకుండా చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో దేవుళ్ళకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటన పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనను ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిన బాబు ఆశలు అడియాసలయ్యాయి. రెండు రోజుల్లోనే చిత్తూరు జిల్లా పోలీసులు కేసును ఛేదించారు. మతిస్థిమితం లేని జ్యోతి అనే మహిళ ఇలా చేసినట్లు విచారణలో తేలింది. ఎస్పీ సెంథిల్ వివరాలను మీడియాకు వెల్లడించారు. అదే సమయంలో ఈ ఘటన పై నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు క్లాస్ పీకారు. ఈ ఘటనలో కుట్ర జరిగిందనేలా చంద్రబాబు ట్వీట్ చేయడం సరికాదన్నారు. నిజానిజాలు నిర్ధారించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని బాబుకు సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా కేసులు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఏడు పదుల వయస్సు, 4 దశాబ్డల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పటి కైనా ప్రజలకు మేలుజరిగేలా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా అని చెప్పుకునే చంద్రబాబు.. నిజాలు తెలుసుకోకుండా మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడడం విడ్డూరం.

Also Read : టీడీపీకి తిరుప‌తి క‌లిసొచ్చే సీటు కాదా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp