చెవిరెడ్డి రూటే సపరేటు.....

By Venkat G Sep. 14, 2021, 02:30 pm IST
చెవిరెడ్డి రూటే సపరేటు.....

ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి రావడం వేరు, రాజకీయాల్లోకి వచ్చాక ప్రజాసేవ చేయడం వేరు. ప్రజాసేవనే పరమావదిగా భావించామని ప్రజల సేవలో తరిస్తామని పులిహోర కబుర్లు చాలా మంది రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు. కాని ఆచరణలో మాత్రం అది కరువైంది అనేది మనం రోజు చూస్తూనే ఉంటాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది రాజకీయం. అది ఒక రకమైతే... మరో రకం రాజకీయ నాయకులు ఉంటారు. గెలిచాం కదా మనకు ప్రజలతో పనేంటి అనే ఆలోచనలో ఉండకుండా ప్రజల్లో ఉండే నాయకత్వం ఒకటి ఉంటుంది.

అందులో మన ఉమ్మడి ఏపీలో ముందు వరుసలో ఉండే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వర్తమాన నాయకుల్లో  ఆయనకో ప్రత్యేకత ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి సన్నిహితుడిగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి... రాజకీయాల్లో పైకి వచ్చిన విధానమే వినూత్నంగా ఉంటుంది. గెలవాలంటే ప్రజల్లో ఉండాలి... నిలవాలంటే ప్రజల్లో కలవాలి... అనే సిద్దాంతాన్ని నమ్ముకున్న ఆయన గెలుపు ఓటములతో సంబంధం లేకుండానే చంద్రగిరి నియోజకవర్గంలో తన ప్రజలకు అండగా నిలుస్తున్నారు.

సిఎం వైఎస్ జగన్... ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ... 2014 లో తొలిసారి ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి... అంతకు ముందు తుడా చైర్మన్ గా తన పరిధిలో ఉన్న ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.. అప్పుడప్పుడు దూకుడుగా మాట్లాడినా సరే... అది రాజకీయ ప్రత్య్యర్థులకే పరిమితం . ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులను కూడా అభిమానంగా చూస్తాడు ... నిత్యం ఎదో ఒక కార్యక్రమంతో జనంలో ఉంటాడు .

Also Read: నిండుకుండల్లా సీమ ప్రాజెక్టులు - పొంగిపొర్లుతున్న పెద్దేరు

జగన్ పై ఎవరైనా విమర్శలు చేసినా సరే ఘాటుగానే సమాధానం ఇచ్చారు చెవిరెడ్డి. ప్రత్యర్ధి పార్టీ అయినా సొంత పార్టీ అయినా సరే నేను ఉన్నా అనే నమ్మకాన్ని కలిగించడంలో ఆయన తన నియోజకవర్గంలో సఫలం అయ్యారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా సరే చెవిరెడ్డి... సొంత డబ్బులతో ప్రజలకు సహాయం చేసిన సందర్భాలు ఎన్నో. కష్టం అని గడప తొక్కితే తన చేతిలో ఉన్న సాయం చేయడానికి ముందుకు వచ్చే ఆయన్ను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఎక్కడా వెనక్కు తగ్గలేదు.

ఎమ్మెల్యేగా ఉండి... నియోజకవర్గ పరిధిలో ప్రతీ సమస్యను తెలుసుకుని దాని పరిష్కారానికి అప్పుడు ఇప్పుడూ కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అంటారు అక్కడి ప్రజలు. ఇప్పుడు సిఎం జగన్ వద్ద తనకు ఉన్న మంచి పేరుతో... నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. ఆయన్ను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో కష్టపడ్డారు. ముందుగానే నియోజకవర్గ నాయకులను ఒప్పించి... అందరికంటే ముందే 2019 ఎన్నికల్లో చెవిరెడ్డిపై పోటీకి తన సన్నిహితుడు పులివర్తి నానీని దించారు. సీటు వచ్చిన తర్వాత ప్రతీ గ్రామంలో కూడా పులివర్తి నానీ పర్యటన చేసి... ఎలక్షన్ కోడ్ రాకముందు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం పేరుతో చేసినా సరే చెవిరెడ్డి ముందు నిలబడలేదు.

సిఎం జగన్ ఫుల్ సపోర్ట్ తో... వరుసగా రెండోసారి 40 వేలకు పైగా మెజారిటీ తో చెవిరెడ్డి గెలుపొందారు. సొంత నియోజకవర్గం అయినా, నియోజకవర్గంపై పూర్తి పట్టున్నా సరే చంద్రబాబు వ్యూహాలు పారలేదు. పార్టీ గెలిచిన తర్వాత కూడా చెవిరెడ్డి తన పంథాలోనే ముందుకు వెళ్ళారు. రాజకీయ నాయకుడిని కాదు మీ కుటుంబ సభ్యుడిని అంటూ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో తనకు అభిమానులను పెంచుకున్నారు. ఎమ్మెల్యే గా ఉంటే చాలా మంది ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటారు.

Also Read: బాగున్నారా అంకుల్ : వాళ్లకు చినబాబు ఫోన్లు...

కాని చెవిరెడ్డి మాత్రం నియోజకవర్గంలోనే ఉంటూ... వ్యక్తిగత వ్యవహారాలను సన్నిహితులకు అప్పగించి... ప్రజల్లో ఉంటారనే టాక్ ఉంది. ప్రతీ నెలా తన ఇంటి నుంచి ప్రతీ కుటుంబానికి ఏదోక సహాయం చేస్తూ ఉంటారు చెవిరెడ్డి. కరోనా మొదటి వేవ్ లో రేషన్ సరుకులు ఇస్తూ... లక్ష శానిటైజర్ లు ఆర్డర్ పెట్టి ప్రతీ ఇంటికీ... పంచుతూ... కరోనా సోకిన వారు మందులకు ఇబ్బంది పడకుండా చూస్తూ ప్రభుత్వంతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేశారు. రెండు మూడు సార్లు లాక్ డౌన్ సమయంలో రేషన్ సరుకులను నియోజకవర్గంలో పేదలకు పంచారు ఆయన.

ఇప్పుడు ఆయన మరోసారి తన నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని కాబోయే వధూవరులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి ‘పెళ్లికానుక’ అందిస్తు వారికి అండగా ఉంటున్నారు. ఒక్కో జంటకు దాదాపు రూ.20 వేల రూపాయలతో బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పట్టు వస్త్రాలను ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని ముందు కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వివాహం చేసుకునే వారికి ఇచ్చే వారు. అందజేసేవారు.

ఇక నుంచి తన నియోజకవర్గ పరిధిలో ఎక్కడ వివాహం చేసుకున్నా సరే పెళ్లి కానుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సరైన ఆధారాలు చూపించి కానుక తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. సోమవారం తుమ్మలగుంటలో తొలిసారి ఏడు జంటలకు ఈ కానుకను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా అందించారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ నమ్మి గెలిపించిన వారికి ఫుల్ సపోర్ట్ గా నిలుస్తున్నారు చెవిరెడ్డి.

Also Read: వరుస మార్పుల వెనుక బీజేపీ వ్యూహం ఏమిటీ, మోడీ కొత్త ఎత్తుల ఫలితాలు ఎలా ఉంటాయో?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp