టీడీపీ వైఖరేంటి బాబూ?

By Chari.Ch Jan. 21, 2021, 08:00 am IST
టీడీపీ వైఖరేంటి బాబూ?

ఇదీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న పార్టీ వ్యస్థాపక అధ్యక్షులు నందమూరి మాటలు ఏనాడో మరుగున పడిపోయాయి. అధికారంలో ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి పెద్దవీట వేసిన చంద్రబాబు, అధికారం కోల్పోయి, పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మాత్రం బీసీ జపం చేస్తున్న తీరు చూసి చివరకు పార్టీ కార్యకర్తలకు సైతం కలుగుతున్న ప్రశ్న ఇది.

విషయానికి వస్తే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థాలు క్షేత్రంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారు ద్వంసం, చెప్పలు విసిరిన ఘటన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనలో సంబంధం ఉందంటూ టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. రాజాంలోని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి భారీ బందోబస్తు మధ్య ఈ అరెస్టు జరిగింది. ఇంతేముంది తెలుగు తమ్ముళ్లు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు.

రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హం త‌ల ఎత్తుకెళ్లిన వారిని ప‌ట్టుకోలేక‌పోయిన చేత‌కాని స‌ర్కారని, అత్యంత సౌమ్యుడైన బీసీ నేత‌..టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు కిమిడి క‌ళావెంక‌ట‌రావును అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, అధికారం అండ‌తో ఇంకెంత‌మంది బీసీ నేత‌లపై త‌ప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తావు జ‌గ‌న్‌రెడ్డీ? అంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.

అయ్యా నారా లోకేష్ గారు..కళావెంకట రావు కులం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? పార్టీలో సరైన గుర్తింపు లేక సదరు నేత పక్కచూపులు చూస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చినప్పుడు గుర్తుకు రాలేదా? ఆ విషయం పక్కన పెడితే..ఎస్సీ, ఎస్టీ, ఓసీ నేతలను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చా.? ఇప్పటి వరకు పార్టీని బతికించు కోవడం కోసం మతరాజకీయాలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ మతత్వ పార్టీ అంటూ గొంతుచించుకున్న చంద్రబాబుకు ఒక్కసారిగా రామతీర్థం ఘటన గుర్తుకు వచ్చి, హిందూ సమాజంపై ప్రేమ పుట్టుకు వచ్చింది.అదే సమైక్యాంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో వెయ్యికాళ్ల మండపు మాటేమిటో సెలవిస్తారా? అంటే మీ రాజకీయ ఉనికి కోసం బీసీలను వాడుకుంటారా? అధికారంలోకి వచ్చినప్పుడు ఏమాత్రం అనుభవం లేని నారాయణలాంటి వ్యక్తులకు కీలకమైన మంత్రిపదవులు ఇస్తారా? అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా?

ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్టు ఖండిస్తున్నానంటూనే..రామతీర్థంలో రాముడి తలను ధ్వంసం చేసిన వారిని పట్టుకోకుండా బీసీ నేతను అరెస్టు చేయడం దుర్మార్గం అంటూ రెచ్చిపోయారు..పాపం అచ్చెన్నకు తెలియదారామతీర్థంలో రాముడి తలను ధ్వంసం చేసిన వారిని పట్టుకోకుండా బీసీ నేతను అరెస్టు చేయడం దుర్మార్గం. వెంకట్రావును ఎందుకు అరెస్ట్ చేసారో..? అది సరే మీరు అధికారంలో ఉన్నప్పుడు, సమైక్యాంధ్రలో నకిలీ స్టాంపులు కుంభకోణంలో కృష్ణయాదవ్ ను అరెస్ట్ చేసినప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా? లేక తెలంగాణ బీసీలు బీసీలు కారా? కేవలం ఆంధ్ర ప్రాంతం బీసీలే బీసీలా?

మరోవైపు.. మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతు కళావెంకట్రావు అరెస్టు ఖండించారు ఓకే.. కానీ అర్ధ రాత్రిళ్లు అరెస్టు చేయడం సిగ్గనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు.. అన్నీ గుర్తే.. చక్ర వడ్డీతో సహా తిరిగిస్తాం అంటూ హెచ్చరించారు. అయ్యా జవహర్ గారూ.. సమైక్యాంధ్ర ప్రదేశ్ లో మీ హయాంలో అంగన్ వాడీలు చలో అసంబ్లీ కార్యక్రమం చేపడితే..గుర్రాలతో తొక్కించిన సంగతి మరిచి పోయారా? అంటే ఆవిషయం గుర్తుంచుకొని ప్రస్తుత ప్రభుత్వంటీడీపీ నేతల మీద ప్రతీకారం తీర్చుకోవాలా?

మరో టీడీపీ నేత కొల్లు రవీంద్ర కళా అరెస్ట్ పై మాట్లాడుతూ.. టీడీపీ చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్రను పక్కదారి పట్టించేందుకే కళా వెంకట్రావు గారి అరెస్ట్ చేసారని ఆరోపించారు. బీసీ నేతలపై జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయ్యా కొల్లు.. మరి వైసీపీలో ఉన్న బీసీనేతలు బీసీలు కారా? టీడీపీ కొమ్ము కాస్తేనే బీసీలా?

వాస్తవానికి టీడీపీకి గుండకాయే బడుగు బలహీన వర్గాలు. పార్టీ నందమూరి తారక రాముని చేతిలో ఉన్నంత వరకు బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాలకు సరైన ప్రాధాన్యం లభించింది. ఆయన నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్న తర్వాత ..బీసీలను కేవలం ఓటుబ్యాంకుగానే చూస్తున్నారు. అవరం ఉన్నంత వరకు బీసీ మంత్రం జపిస్తూ..అవసరం తీరాక వదిలేస్తున్నారు.అందుకు తెలంగాణలో గతంలో ఓవెలుగు వెలిగిస,ప్రస్తుతం కనుమరుగైనా బడుగు బలహీన వర్గాల నేతలే ఉదాహరణ. అంటే చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు తమ సామాజిక వర్గం తప్ప, ఇతర సామాజిక వర్గాలు పనికి రావు. అధికారం కోల్పోయాక మాతం బడుగు బలహీన వర్గాల మీద ఎక్కడ లేనిప్రేమ పుట్టుకు వస్తుంది.ఇదిగొ మొన్న అచ్చెన్నాయడు అరెస్టప్పుడు, ఇప్పుడు కళా అరెస్టప్పుడు. అంతే!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp