చంద్ర‌బాబు ఉద్య‌మ బండారం బ‌ట్ట‌బ‌య‌లవుతోందా..?

By Kalyan.S Sep. 16, 2020, 08:00 am IST
చంద్ర‌బాబు ఉద్య‌మ బండారం బ‌ట్ట‌బ‌య‌లవుతోందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుస‌రిస్తున్న అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌ను దేశ‌మంతా ప్ర‌శంసిస్తోంది.. కానీ చంద్ర‌బాబు మాత్రం విమ‌ర్శిస్తున్నారు. అన్ని ప్రాంతాల‌ స‌మ‌గ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్ర‌జలంతా ఎదురుచూస్తున్నారు.. కానీ అభివృద్ధి అమ‌రావ‌తిలోనే కేంద్రీకృతం అయ్యే రీతిలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మూడు రాజ‌ధానుల‌ను అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల‌లోని కొన్ని గ్రామాలు మిన‌హా.. రాష్ట్రమంతా ఆహ్వానిస్తోంది.. కానీ చంద్ర‌బాబు మాత్రం అడ్డుప‌డుతున్నారు. అంతేకాదు తాను నిర్ణ‌యించిన అమ‌రావ‌తే రాజ‌ధానిగా కొనసాగించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఎవ‌రూ స‌హ‌క‌రించ‌క‌పోయినా.. అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఉండాల‌ని పార్టీ కృష్ణా జిల్లా నేత‌లు మిన‌హా మిగ‌తా వారెవ్వ‌రూ మ‌ద్ద‌తు తెల‌ప‌క‌పోయినా చంద్ర‌బాబు నిరంత‌రంగా ఉద్య‌మాన్ని న‌డుపుతున్నారు. క‌రోనా కాలంలో ఎన్నో స‌మ‌స్య‌లు ప్ర‌జ‌ల‌ను ప‌ట్టిపీడిస్తున్నా.. ఆయ‌న కేవ‌లం అమ‌రావ‌తి కోస‌మే ఎందుకంత‌లా పోరాడుతున్నారు..? దాని వెన‌క భారీ స్థాయిలో భూ దందాలు జ‌ర‌గ‌డ‌మే కార‌ణ‌మా..? అని ఎన్నో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాయి. తాజా ప‌రిస్థితుల‌తో అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

అస‌లు క‌థ ఇదే..నా?

అమ‌రావ‌తి నే ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుబ‌డుతుండడానికి అస‌లు కార‌ణాలు త‌న వాళ్ల కోస‌మే న‌న్న ఆరోప‌ణ‌ల‌ను ఏసీబీ ద‌ర్యాప్తులో వెలుగుచూస్తున్న నిజాలు బ‌ల‌ప‌రుస్తున్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్ర‌క‌ట‌కు ముందు ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగిన‌ట్లు నిర్ధార‌ణ అవుతోంది. కొంత మంది ముంద‌స్తు స‌మాచారం మేర‌కు అటు కేపిటల్ ఏరియాలో లేదా సీఆర్డీఏ లిమిట్స్‌లో, కోర్ క్యాపిటల్‌లో ఆస్తులు కొన్న‌ట్లు ఎఫ్ఐఆర్‌లో ఏసీబీ పేర్కొంది. చంద్ర‌బాబు హ‌యాంలో ఉన్నతస్థానంలో ఉన్న కొందరు అధికారులు నిర్ణయాధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాజధాని కరెక్ట్ లొకేషన్‌ను గుర్తించి అక్కడే బినామీల పేరుతో భూములు కొనుగోలు చేశారంటూ ఎఫ్ఐఆర్‌లో ఏసీబీ ఆరోపించింది. అక్ర‌మాలు బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకే అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని బాబు ఎన్నుకున్నార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగితే అభివృద్ధి ప‌నులు, కార్య‌క‌లాపాలు పెరిగి ఈ కేసుల గొడ‌వ ప‌క్క‌దారి ప‌ట్టే అవ‌కాశాలు ఉండ‌డంతో పాటు.. ఆస్తులకు అధిక ధ‌ర‌లు ప‌లుకుతాయ‌నే బాబు పార్టీని, ఎమ్మెల్యేల‌ను కూడా కాద‌ని అమ‌రావ‌తి కోస‌మే ఉద్య‌మిస్తున్నారని వాద‌న‌లు బ‌ల‌ప‌డుతున్నాయి.
ఇప్ప‌టికే దిన‌దినగండంగా నెట్టుకొస్తున్న టీడీపీని ఈ కేసుల సుడిగుండం ఎటువైపు ప‌డేస్తోందో అనే ఆందోళ‌న పార్టీ శ్రేణుల్లో మొద‌లైంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp