పంతం మీదా.. మాదా సై.!

By Kalyan.S Aug. 04, 2020, 08:37 am IST
పంతం మీదా.. మాదా సై.!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌ధానిపై జ‌రుగుతున్న ర‌గ‌డ రాజ‌కీయ హీట్ పెంచుతోంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల స‌వాళ్లు.. ప్ర‌తి స‌వాళ్ల‌తో వాతావ‌ర‌ణం అట్టుడుకుతోంది. రాజ‌కీయ చ‌ర్చ‌లు ఇప్పుడు క‌రోనాను మించిపోయాయి. సాధార‌ణంగా అసెంబ్లీ సాక్షిగా జ‌రిగే మాట‌ల యుద్ధాలు.. ట్విట్ట‌ర్లు, జూమ్ యాప్ లు, మీడియా స‌మావేశాల వేదిక‌లుగా కొన‌సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన రాజీనామాల స్టేట్ మెంట్ కు వైసీపీ వ‌ర్గాలు దిమ్మ‌దిరిగే స‌మాధానాలు చెబుతున్నాయి. ఒకవైపు టీడీపీ కి ప్ర‌జ‌ల స‌పోర్టు లేక‌పోవ‌డం (అమ‌రావ‌తి ప్రాంతంలోని కొన్ని గ్రామాల స‌పోర్టు త‌ప్ప).., మ‌రోవైపు మెజార్టీ వ‌ర్గాలు ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

డ్రామాలొద్దు.. ద‌మ్ముంటే రాజీనామాలు చేయండి...

చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌ విసిరారు. ప్రభుత్వం నిర్ణయం తప్పు అంటున్న చంద్రబాబు 23మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లమని సూచించారు. ‘అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారు. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే ప్రాంతీయ అసమానతలు వస్తాయి. అమరావతిని ఎక్కడ రాజధానిగా తీసేయలేదు. అదనంగా మరొ రెండు రాజధానులు వస్తున్నాయి. అని అన్నారు.

అప్పుడు కూడా ఇంత గ‌గ్గోలు పెట్ట‌లేదు..

రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇంత గగ్గోలు పెట్టలేదు. బినామీలు నష్టపోతారని ఇప్పుడు చాలా బాధపడిపోతున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో సొంత ఇల్లు కట్టుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్‌లో కట్టుకోలేదు. ఇక్కడ అక్రమ కట్టడంలో తలదాచుకుంటున్నారు. ఆయన ఐదు నెలల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. రాజధానికి లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. ఎక్కడ నుంచి తేవాలి ఆ లక్ష కోట్ల రూపాయిలు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ భూమిని రాజధానిగా పెట్టాలని అసెంబ్లీలో చెప్పారు. ఆయన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు ఇంత రాద్ధాంతం చేయలేదు. అని ధ్వ‌జ‌మెత్తారు. బీటెక్‌ రవి రాజీనామా వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఆయన స్ఫూర్తితో టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కుప్పం నుంచి గెల‌వండి చాలు...

చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామా చేసి కుప్పం నుంచి గెలవాలని మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని.. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అధికార పార్టీ వైసీపీకి చంద్రబాబు సవాల్ విసిరిన సవాల్‌పై కోడాలి నాని స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకెళ్లి చంద్రబాబు గెలిపించుకోవాలన్నారు. మీరు రాజీనామా చేసి గెలిచిన తర్వాత తమ ప్రభుత్వం మూడు రాజధానులపై పునరాలోచిస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. రాజధానిని ఎవరూ మార్చట్లేదని అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుందని ఈ సందర్భంగా మరోసారి మంత్రి నాని స్పష్టం చేశారు.

అమ‌రావ‌తి ఎజెండాతో పోటీ చేయ‌గ‌ల‌రా...

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి అమరావతి ఎజెండాతో ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్ విసిరారు. టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. శ్రీభాగ్ నుంచి శివరామకృష్ణన్ దాకా వికేంద్రీకరణకే నిపుణులు మొగ్గు చూపారని ఇక్బాల్ స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. టీడీపీ ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp