స్వార్ధానికి కొత్తర్ధం చెబుతున్న ‘టీడీపీ’

By Jaswanth.T Aug. 09, 2020, 09:25 am IST
స్వార్ధానికి కొత్తర్ధం చెబుతున్న ‘టీడీపీ’
ఒక వ్యక్తి తన సొంతం కోసం లేదా తన వారి కోసం ఏదైనా ప్రయోజనం పొందే విధంగా వ్యవహరిస్తే దానిని స్వార్ధం అంటారు. కానీ నారా వారి పాలనలో విధానాలు మారినట్లే పదాలకు అర్ధాలు కూడా మార్చేసినట్టున్నారు. అధికారం మారిపోయినప్పటికీ తాము రూపొందించుకున్న అర్ధాలతోనే పదప్రయోగాలతో మైకుల ముందుకొచ్చేస్తున్నారు. చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో సీయం జగన్‌ స్వార్ధంతోనే ఇదంతాచేస్తున్నాడన్నది పెదబాబు చంద్రబాబుతో పాటు సీనియర్‌ టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావులు ఇటీవలే సెలవిచ్చారు. వీరి స్టేట్‌మెంట్లు విన్న ఎవ్వరికైనా ముందుకు నవ్వే వస్తుంది. ఆ తరువాత మాత్రం స్వార్ధమంటే వీళ్ళకున్న అర్ధం వేరేఅనుకుంటా అన్న సందేహమూ వస్తుంది.

పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవడం దగ్గర్నుంచి ప్రారంభిస్తే మొన్న 2019 ఎన్నికల్లో కాశ్మీర్‌ నుంచి తీసుకువచ్చి మరీ ఫరూక్‌ అబ్దుల్లాను వాడుకోవడం వరకు ఏ ఒక్క అంశంలోనూ చంద్రబాబుకు ‘స్వార్ధం’ మాత్రం ఏమీ లేదు. అంతా నిస్వార్ధమే పాపం. ఎంతో మంది ఉన్నత విద్యావంతులు, పార్టీలో సీనియర్లు ఉన్నప్పటికీ తన యువరాజును ప్రమోట్‌ చేసుకోవడానికి చినబాబును ఎమ్మెల్సీ/మంత్రిని చేసెయ్యడంలో కూడా ఏం స్వార్ధం కన్పించదు. ఆచరణ సాధ్యం కాని అమరావతిని సృష్టిస్తున్నానని చెప్పి, ఆ ప్రాంతానికి చుట్టూ తన అనుచరగణం చేతనే భూములు కొనుగోలు చేయించడం కూడా నిస్వార్ధంగానే జరిగింది మరి. కేవలం రాష్ట్ర ప్రజల తలరాతలను?! మార్చేయడానికే పెదబాబు నిస్వార్ధంగా అవన్నీ చేసేసారుమరి. అసలివన్నీ ఎందుకండీ మన బాబుగారి నిస్వార్ధ బుద్ది తెలిసే మాయవతి, నితీష్‌కుమార్‌ తదితర నాయకులు ఈయన వైపునకు కూడా పెద్దగా దృష్టిపెట్టలేదని రాజకీయవర్గాలు చెప్పుకోవడం జనం దృష్టిలో లేకపోలేదు. వీటన్నిటినీ పక్కనెట్టేసి ‘ఏ రోజుకారోజు పడగడుపే’ అన్న రీతిలో తమ నిస్వార్ధ సేవలను గురించి జనానికి తెలియదన్నట్లు జగన్‌ను ఆడిపోసుకోవడం జనాన్ని ఆశ్చర్యపరుస్తోందనే చెప్పాలి.

అక్కడికీ సీయం జగన్‌ దీనిపై కూడా క్లారిటీ ఇచ్చారు. స్వార్ధముండి ఉంటే రాజధానిని కడపకు పట్టుకుపోయేవాడ్ని గానీ రాష్ట్రాంలో ఉన్న మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ ప్రకటించను కదా? అంటూ వివరించారు కూడా. అయినప్పటకీ మైకుముందుకొచ్చి మాట్లాడే మాటలోల ఈ ‘జగన్‌ స్వార్ధం’ అన్న పదం లేకుండా ఉపన్యాసం ముందుకు నడపలేకపోతున్నారు పాపం టీడీపీ నాయకులు. అయితే ఇక్కడొక విషయాన్ని మాత్రం వారు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్‌ ప్రకటించే ప్రతి కార్యక్రమం, ప్రతి సంక్షేమ పథకం అందుకుంటున్న లబ్దిదారులంతా చంద్రబాబు ప్రభుత్వానికి, జగన్‌ ప్రభుత్వానికి ఉన్న తేడాను తప్పకుండా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు హయాంలో ఆ స్థాయిలో ఇబ్బందులు పడ్డారు కాబట్టే. ఈ నేపథ్యంలో పెదబాబు, చినబాబు అండ్‌ కంపెనీ ‘స్వార్ధం’ పల్లవిని విడిచిపెట్టి కొత్త రాగం అందుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో కాస్తంత ఆలోచించుకోవడం బెటరన్నది రాజకీయ వర్గాల టాక్‌.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp