అదానీ డేటా పార్క్, బాబు అండ్ బ్యాచ్ కి వాస్తవాలు మింగుడుపడవని చాటిన వాస్తవం

By Raju VS Nov. 27, 2020, 01:25 pm IST
అదానీ డేటా పార్క్, బాబు అండ్ బ్యాచ్ కి వాస్తవాలు మింగుడుపడవని చాటిన వాస్తవం

ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. వనరుల వినియోగానికి తగిన రీతిలో వ్యవహరిస్తోంది. పెట్టుబడుల కోసం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బృందం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. జగన్ నేతృత్వంలో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కరోనా విపత్తు వేళ కూడా ఏపీలో పలు సంస్థలు పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపడం విశేషంగానే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ ఛాయలు అలముకున్న సమయంలో కూడా ఏపీలో ఏదో మేరకు పెట్టుబడులు రావడం గమనిస్తుంటే ప్రభుత్వ విధానాలు విజయవంతమవుతున్నట్టు భావించాల్సి ఉంటుంది.

Also Read: భారతీయ సాఫ్ట్‌వేర్ పరిశ్రమ పితామహుడు కన్నుమూత

కానీ వాస్తవాలు గిట్టని చంద్రబాబు, ఆయన సన్నిహితులు మాత్రం తద్విరుద్ధంగా ప్రచారం సాగిస్తున్నారు. ఉదాహరణకు వివాఖలోని అదానీ డేటా పార్క్ విషయంలో వారి భాగోతం బయటపడింది. ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలు వారికి మింగుడుపడడం లేదని తేటతెల్లమవుతోంది. తమ హయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చినట్టు, జగన్ పాలనలో కంపెనీలన్నీ రాష్ట్రాన్ని వీడినట్టు నిత్యం ప్రచారం సాగిస్తున్న తీరు విడ్డూరంగా కనిపిస్తోంది. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను నమ్మించేలా ప్రయత్నంలోనే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

రెండేళ్ల క్రితం 2018 లో చంద్రబాబు అధికారంలో ఉండగా అదానీ గ్రూపు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో 500 ఎకరాల్లో డేటా సెంటర్‌ నిర్మాణం ద్వారా 6 వేల మందికి మందికి ఉపాధి లభిస్తుందని అదానీ పేర్కొంది. 2019 జనవరిలో దానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయినా గానీ అదాని వెనక్కిపోయిందని విష ప్రచారం మాత్రం చేశారు. తీరా చూస్తే అదే విశాఖ కేంద్రంగా డేటా పార్క్ ఏర్పటు చేసేందుకు అదానీ సన్నద్ధం కావడం బాబు గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్టయ్యింది.

Also Read: నువ్వో వారం.. నేనో వారం.. చంద్ర‌బాబు, లోకేశ్ బాబుల ఏపీ షెడ్యూల్

విశాఖలోనే 130 ఎకరాల్లో 14,634 కోట్ల పెట్టుబడితో అదానీ డేటా పార్క్ నిర్మాణానికి రంగం సిద్దమయ్యింది. 24,900 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలపడమే కాకుండా తాజాగా మరో ముందడుగు వేస్తూ ప్రోత్సాహాకాలు ప్రకటించింది. దాంతో టీడీపీ ప్రచారానికి, వాస్తవానికి పొంతనలేదని, ఏపీలో పెట్టుబడుల రాక ప్రారంభమయ్యిందని స్పష్టమవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp