Chandrababu - రెండున్నరేళ్లు సానుభూతి నిలుస్తుందా ?

By Voleti Divakar Nov. 27, 2021, 09:30 am IST
Chandrababu - రెండున్నరేళ్లు సానుభూతి నిలుస్తుందా ?

అదేదో సినిమాలో ఒక హాస్యనటుడి భార్యను మరో నటుడు వాటేసుకుంటాడు . ఈ సన్నివేశాన్ని ఎవరూ చూడకపోయినా ... కనిపించిన వారందరికీ తన భార్యను ఎలా వాటేసుకున్నాడో చూపించి , మరీ బాధపడుతుంటాడు . ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది . అసెంబ్లీలో ఆయన సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారని బోరున విలపించారు . తాను ముఖ్యమంత్రిగా గెలిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశారు . అంతకుముందు ఆయన సామాజిక వర్గానికే చెందిన ఒక నాయకుడు భువనేశ్వరిని కించపరిచేలా మీడియా ముందు మాట్లాడారని టీడీపీ నేతలే చెబుతున్నారు. అప్పటికి కుప్పంలో ఎన్నికల ఫలితాలు రాకపోవడం గమనార్హం. అప్పుడు రాని బాధ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాబులో కలగడం వ్యూహాత్మకంగా అనుమానిస్తున్నారు.

టీవీల్లో చంద్రబాబును చూసిన వారు అయ్యోపాపం అన్నారు . అసెంబ్లీలో భువనేశ్వరిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడినట్లు రికార్డుల్లోకి ఎక్కడా ఎక్కలేదు . విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు బోరున రోధిస్తూ తన సతీమణికి అవమానం జరిగినట్లు చెప్పడంతో అసెంబ్లీలో ఏదో జరిగిందని ప్రజలు భావించారు . ఆరోజున రాష్ట్ర ప్రజలకు వైసిపి ఎమ్మెల్యేలు భువనేశ్వరిని ఉద్దేశించి ఏమి మాట్లాడారో ... బాబు ఎందుకు ఏడ్చారో చాలాసేపటి వరకు అర్థం కాలేదు . యూట్యూబ్ , టీవీ చానళ్లు , సామాజిక మాధ్యమాల్లో ఈవిషయమై తెగ వెతికారు . చివరకు రికార్డుల్లోకి ఎక్కని వ్యాఖ్యలతో చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు గుర్తించారు . ఆ మరుసటి రోజే మహానటుడు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులతో విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయించి , సానుభూతి కోసం ప్రయత్నించారు .

Also Read : Chandrababu, YS Jagan - చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ఒక్క మాటలో అభివర్ణించిన వైఎస్‌ జగన్‌

చంద్రబాబునాయుడు శపథం ప్రకారం మరో రెండున్నరేళ్ల వరకు ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు లేవు . అంటే ప్రజల సానుభూతిని పొందేందుకు ఈరెండున్నరేళ్లు రాష్ట్రవ్యాప్తంగా భువనేశ్వరికి జరిగిన అవమానాన్నే టిడిపి తన ప్రధాన అజెండాగా మార్చుకుని , ఎన్నికల బరిలోకి దిగుతుందా అన్న చర్చ జరుగుతోంది. .అంటే ప్రజాసమస్యలన్నీ పక్కన పెట్టి పార్టీ అధినేత సతీమణికి జరిగిన అవమానాన్ని ఊరూవాడా ... తెలిసిన వారికీ తెలియని వారికీ ప్రచారం చేస్తారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి . ఒకవేళ అదే అజెండా అయితే టిడిపికి ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు . మహానటుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన తరువాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో చంద్రబాబును , ఆయనపార్టీని ప్రజలు ఓడించాలి . అయితే ఆ వెంటనే ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోయారు . ఈనేపథ్యంలో భువనేశ్వరి ఎపిసోడ్ను ప్రజలు ఎప్పటివరకు గుర్తుంచుకుంటారన్నది ఆలోచించాల్సిన విషయం .

ఇక టిడిపి ఎమ్మెల్యేలు కూడా పార్టీ అధినేత బాటలోనే అసెంబ్లీని బహిష్కరించారు . టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం తమ పార్టీ అధికారంలోకి వస్తేనే అసెంబ్లీలోకి అడుగుపెడతామని ప్రతిజ్ఞ బూనకపోవడం గమనార్హం . అంటే వచ్చే సమావేశాలకు వారు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . అవమానం ఎపిసోడ్లో భాగంగా మరోవైపు చంద్రబాబు 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తారా లేదా ... సానుభూతి పనిచేయక ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాకపోతే ఆయన కుప్పం ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read : Chandrababu- చివరి అస్త్రాన్ని ప్రయోగించడం మొదలు పెట్టిన చంద్రబాబు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp