అనుకున్న దొక్కటి...! అయినది ఒక్కటి..!!

By Kalyan.S Jan. 13, 2021, 11:45 am IST
అనుకున్న దొక్కటి...! అయినది ఒక్కటి..!!

అనుకున్న దొక్కటి అయినది ఒక్కటి అన్నట్లు తయారైంది టీడీపీ అధినేత చంద్రన్న పరిస్థితి. నాలుగు పదులు అనుభం పాపం రివర్స్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ..బీజీపీని మతత్వ పార్టీ, బీజేపీ గెలిస్తే మతకల్లోలాలు వస్తాయన్న రేంజ్ లో విమర్శలు గుప్పించిన చంద్రబాబు, పార్టీని బతికించుకోవడం కోసం.. మతం పేరుతో రాజకీయం చేస్తుంటే అది కాస్తా రివర్స్ అయింది. అధికారంలోకి రావడానికి, అధికారంలో ఉన్నప్పుడు క్రీస్తు భజన చేసిన చంద్రబాబు (ఓ క్రిస్ మస్ సభలో సాక్షాత్తు చంద్రబాబే బైబిల్ చేతపట్టుకుని ...యోహోవా అంటూ..ఓ మత్తై సువార్తను చదివి వినిపించి చప్పట్లు కొట్టించుకున్నారు) ప్రస్తుతం ఓ క్రైస్తవును చేతిలో రాష్ట్రం ఉందంటూ ..జగన్ ను టార్గెట్ చేస్తే అది కాస్తా బూమారంగైంది.. క్రిస్టియన్స్ ఇప్పుడు చంద్రబాబు మీద అగ్గీమీద గుగ్గిలంలా చిందులేస్తున్నారు..

గత ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావడమే కాకుండా.. అధికారంలోకి విచ్చిన వైసీపీ సర్కార్.. టీడీపీ ఆర్ధిక మూలాలపై కన్నేసింది.. అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ మొదలు కొని, టీడీపీ పాలనలో జరిగిన కుంభకోణాలను వెలికి తీస్తోంది.. నా అనుభవమంత వయస్సు లేదని చంద్రబాబు ఎద్దేవా చేసినా, చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు జగన్. దానికి తోడు పార్టీ క్యాడర్లో ఏదో తెలియని అభద్రతా భావం.. కొందరు వైసీపీలో చేరితే, మరి కొందురు ఎటొచ్చిఎటు పోతుందో అన్నమీమాంసలో ఉండిపోయారు.. కొందరు గళం విప్పినా ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో ఏపీలో టీడీపీ తుడుచుపెట్టుకు పోయే పరిస్థితి. అది గమనించిన చంద్రబాబు..పార్టీ పురుత్తేజం కోసం పడని పాట్లు లేవు..

ఈ క్రమంలో రామతీర్థం విగ్రహ ధ్వంసం ..లడ్డూలా దొరిగిందని చంద్రబాబుకు సంబుర పడిపోయారు.. ఇంకేముందు గద్దెమీద ఉన్న సీఎం క్రిష్టియన్ కాబ్టేట దేవాలయాపై దాడులు జరుగుతున్నాయంటూ..హిందువుల మనోభావాల గురించి పట్టించు కోవడం లేదని, ఊరూరా చర్చిలు ఏర్రాటు చేస్తున్నారంటూ రెచ్చిపోయారు.. అంతేకాదు పాస్టర్లకు జీతం గురించి వ్యతిరేకంగా మాట్లాడారు.. గతంలో మత రాజకీయాలు చేస్తుంది బీజేపీ అంటూ విమర్శించిన చంద్రబాబు... పార్టీని బతికించుకోవడం కోసం మత రాజకీయం చేస్తూ హిందువులు ఆదరణ పొందేందుకు ప్లాన్ వేశారు. బాబు రాజకీయాలు మెజారిటీ ప్రజలు ఆదరణ చూరగొంటాయో లేదో కాని, క్రిష్టియన్లు మాత్రం చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగురు వేస్తున్నారు..

వివరాల్లోకి వెళితే.. తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీకి చెందిన క్రిస్టియన్ సెల్ నేతలంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే వారంతా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని చెప్పారు. క్రైస్తవ సమాజాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని... చర్చిలకు కూడా వెళ్లి అనేక సార్లు ప్రార్థనలు చేశారని చెప్పారు. పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల వేతనాన్ని ఇస్తే దాన్ని చంద్రబాబు తప్పుపట్టడం దేనికని ప్రవీణ్ ప్రశ్నించారు. క్రిస్టియన్లలోకి బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారని... మతమార్పిడులు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఎప్పటి నుంచో చర్చిలు ఉన్నాయని... వాటిని ఇప్పుడే కొత్తగా ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు చెపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పార్టీ నేతల దృష్టిని తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదని... అందుకే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు.

మరోవైపు వీరంతా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయాల కోసం ఉన్నట్టుండి యూటర్న్‌ తీసుకుని క్రిస్టియన్లను అవమానిస్తూ మాట్లాడడం, వారిపై నిందలు వేయడం ఏమిటని పలువురు టీడీపీ క్రిస్టియన్‌ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పైగా కేవలం తమ రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం చంద్రబాబు తమ మతంపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ కులమతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆలిండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ క్రిస్టియన్‌ లీడర్స్‌ ఫోరం, విశాఖ చాప్టర్‌ అధ్యక్షుడు రెవరెండ్‌ అద్దేపల్లి రవిబాబు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖలోని (జీవీఎంసీ) గాంధీ విగ్రహం వద్ద క్రైస్తవులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు వెంటనే క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అదీ ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధినేత చంద్రన్నపరిస్థితి. మనిషిని చేయాలనుకుంటే కోతి అయినట్లు.. మెజారిటీ మాట దేవుడెరుగు..మైనారిటీ వర్గమైనా క్రిస్టియన్ సమాజం బాబుపై ఫైరవుతోంది. పాపం చంద్రబాబు..అనుకున్న దొక్కటి అయితే.. అయింది మరొకటి.. ఏం చేస్తాం అనుభవించక తప్పదు..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp