కరోనా వైరస్ పరీక్షలకు చంద్రబాబుకు అతీతుడా ? చెక్ పోస్టు దగ్గర హై డ్రామా

By Phani Kumar Jun. 02, 2020, 09:45 am IST
కరోనా వైరస్ పరీక్షలకు చంద్రబాబుకు అతీతుడా ? చెక్ పోస్టు దగ్గర హై డ్రామా

జడ్ ప్లస్ క్యాటగిరిలో నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ భద్రత ఉన్న వ్యక్తులు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అతీతులా ? తాజాగా జరిగిన ఓ ఘటనను చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే తెలంగాణా నుండి అమరావతికి సోమవారం మధ్యాహ్నం చంద్రబాబునాయుడు వచ్చాడు. తెలంగాణా-ఏపి సరిహద్దుల్లోని గరికపాడు చెక్ పోస్టు దగ్గర చంద్రబాబుకు కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పరీక్షలు చేయటానికి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశాడు.

అయితే చెక్ పోస్టు దగ్గర అధికారులు చేరుకోవటాన్ని గమనించిన టిడిపి నేతలు కొందరు ఇదే విషయాన్ని చంద్రబాబుకు చేరవేశారు. వెంటనే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సెక్యురిటి అధికారులు రంగంలోకి దిగారు. చంద్రబాబు జడ్ ప్లాస్ క్యాటగిరిలో ఉండే ఎన్ఎస్జీ భద్రతలో ఉండే ప్రముఖ వ్యక్తన్న విషయాన్ని గుర్తుచేశారు. ముందస్తు అనుమతి లేకుండా చంద్రబాబు కాన్యాయ్ ను ఎక్కడపడితే అక్కడ ఆపేందుకు లేదని గట్టిగా చెప్పారు. సరే ఇదే విషయమై ఇటు రెవిన్యు అధికారులకు అటు చంద్రబాబు సెక్యురిటి అధికారులకు మధ్య చాలా సేపు వాగ్వాదాలు జరిగింది.

రెవిన్యు అధికారులు ఎంత చెప్పినా చంద్రబాబు కాన్వాయ్ ను ఆపేందుకు భద్రతా సిబ్బంది అంగీకరించలేదు. చివరకు చేసేది లేక రెవిన్యు అధికారులు వెనక్కు తగ్గటంతో చెక్ పోస్టు దగ్గరకు చేరుకున్న చంద్రబాబు కాన్వాయ్ ఆగకుండానే అమరావతికి వెళిపోయింది. అంటే చంద్రబాబు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోకుండానే వెళ్ళిపోయాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైరస్ పరీక్షలు చేయించుకోవటాన్ని చంద్రబాబు ప్రిస్టేజ్ గా తీసుకున్నట్లున్నాడు. లేకపోతే ప్రభుత్వం అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించటం లేదని రోజు గోల చేస్తున్న చంద్రబాబు తాను మాత్రం పరీక్షలు చేయించుకోవటానికి ఎందుకు ఇష్టపడలేదు. నిజానికి తనంతట తానుగానే పరీక్షలు చేయించుకునేందుకు ముందుకొస్తే ఎంతో హుందాగా ఉండేది. చంద్రబాబు అంతటి వ్యక్తే పరీక్షలు చేయించుకుంటున్నపుడు ఇక మనం ఎంత అని మామూలు జనాలు కూడా పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది కదా ? నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన చంద్రబాబే భద్రత పేరు చెప్పిన పరీక్షలు చేయించుకోవటాన్ని తప్పించుకుంటే ఎలాగ ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp