చెదిరిన చంద్రబాబు స్వప్నం..!

By Voleti Divakar May. 25, 2020, 10:00 am IST
చెదిరిన చంద్రబాబు స్వప్నం..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వప్నం చెదిరి ఏడాదవుతోంది. ఒకే దెబ్బకు రెండుపిట్టలన్నట్లు తన రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీ వైఎస్సార్ సిపి, కేంద్రంలోని తన శత్రువుగా భావించిన ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపిని దెబ్బతీయాలని వ్యూహాన్ని రచించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఆశించిన విధంగా బిజెపిని రాష్ట్రంలో దెబ్బతీ సినా, తాను మాత్రం గెలవలేకపోయారు. అప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న బిజెపి, జనసేన పార్టీలను కూడా చంద్రబాబునాయుడు తన నక్కజిత్తుల వ్యూహాలతో తీవ్రంగా దెబ్బతీశారు. గత ఎన్నికల్లో వైసిపి అధినేత వైఎస్ జగన్ ఒంటి చెత్తో పార్టీని నడిపించి, అనూహ్యంగా 151 సీట్లలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. 2014 ఎన్నికల కన్నా ఏకంగా 84 సీట్లు అధికంగా సాధించగలిగారు. వైసిపి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఈ విషయాలను మరోసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

చంద్రబాబు కుత్సిత రాజకీయ వ్యూహం వల్ల టిడిపి ఓటమిపాలు కావడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన జన సేన అధినేత పవన్ కల్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారధి ఎన్ రఘువీరారెడ్డి ఘోరంగా ఓటమిపాలయ్యారు. చంద్రబాబు రాజకీయ వ్యూహానికి బలై జన సేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, జిల్లా గాజువాకల్లో ఓటమిపాలయ్యారు. చంద్రబాబునాయుడు, జన సేన వామపక్షాలు కూటమితో స్నేహపూర్వక పోటీని ప్రజలు గ్రహించారు.

పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు హయాం తప్ప, చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత టిడిపి ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్న దాఖలాలాలు లేవు. 1999లో బిజెపితో పొత్తు పెట్టుకుని గెలిచిన చంద్రబాబు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధాని నరేంద్రమోడీ హయాంలో జరిగిన గోద్రా అల్లర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2004 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముస్లింల ఓట్ల కోసం ఆయన బిజెపితో తెగతెంపులు చేసుకుని ఆపార్టీ తీరును ఎండగట్టారు. 2004 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర తో ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. ఆ తరువాత 2009లో కూడా చంద్రబాబు, ఆపార్టీకి చెందిన తాబేదారు పత్రికలు ఎన్నికుతంత్రాలు చేసినా మరోసారి వైఎస్ఆర్ విజయాన్ని నిలువరించలేకపోయారు.

రాష్ట్రంలో ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని గ్రహించిన చంద్రబాబునాయుడు మరోసారి బిజెపి, జన సేన పార్టీలతో జత కట్టి, 2014లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మరోసారి బిజెపి అధికారంలోకి రాదన్న అంచనాలతో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వ్యూహాత్మకంగా బిజెపిని దూరం పెట్టడం ప్రారంభించారు. తన ఎంపిల ద్వారా బిజెపిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాభివృద్ధికి నిధులు మంజూరు చేయడం లేదంటూ దుష్ప్రచారాన్ని ప్రారంభించారు.

బిజెపి నాయకులు కూడా చంద్రబాబు నిధుల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోడీయే స్వయంగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును ఎటిఎంగా మార్చుకుని దుర్వినియోగం చేస్తున్నారని మోడీ నిప్పులు చెరిగారు. దీంతో అసహనానికి గురైన చంద్రబాబునాయుడు మోడీ వ్యక్తి గత జీవితంపై విమర్శలు చేయడంతో పాటు, బిజెపిని దెబ్బతీ సేందుకు ప్రయత్నించారు. బిజెపిని రాష్ట్రంలో రాజకీయంగా దెబ్బతీయగలిగినా, చంద్రబాబుకు ప్రజలు కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp