అక్కరకొచ్చిన అల్లుడు

By KalaSagar Reddy 21-11-2019 01:04 PM
అక్కరకొచ్చిన అల్లుడు

ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుర్లు... అల్లుడు ముఖ్యమంత్రి పదవి లాక్కొని, వైశ్రాయ్ దగ్గర చెప్పులు వేయించి తాను పెట్టిన పార్టీని కూడా హస్తగతం చేసుకొని, అత్యంత అవమానకరంగా విలువలు లేవు, నీతి లేదు అని తిడితే, 11 మంది సంతానంలో తండ్రి వైపు గట్టిగా నిలబడింది ఒక్క పెద్ద కొడుకు జయ కృష్ణ మాత్రమే. మరో ఇద్దరు కొడుకులు తండ్రి పక్కన సైలెంటు గా కూర్చున్నారు.

హీరోలు అనుకున్న కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ తండ్రికి వెన్నుపోటు పొడిచి బావ చంద్రబాబుతో కలిసి విజయహట్టహాసం చేశారు. ఇలాంటి కొడుకులనా కన్నది అని ఎన్టీఆర్ దిగులు పడ్డాడు. ఎన్టీఆర్ తిరిగి కోలుకోకూడదన్నట్ల దెబ్బమీద దెబ్బ కొట్టిన చంద్రబాబు, పార్టీ చందాల 75 లక్షలను కూడా కోర్టు ద్వారా సొంతం చేసుకున్నాడు. ఆ దెబ్బతో కలిగిన క్షోభ నుంచి ఎన్టీఆర్ తిరిగి కోలుకోలేదు...

Also Read: ఆక్రోశం ఎంపీలదా?ఆంధ్రజ్యోతిదా?

ఎన్టీఆర్ మారిన తరువాత బాలకృష్ణ,హరికృష్ణ కాడెద్దుల లాగా చంద్రబాబును మోశారు. ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయ కృష్ణ మాత్రం తన తండ్రి ఆశయ సాధనే తనకు ముఖ్యమాని లక్ష్మిపార్వతి వర్గం తరుపున శ్రీకాకుళం ఎంపీగా పోటీచేశాడు. పోటీ అంటే ఏదో నాంకేవాస్తే కాకుండా కష్టపడి పనిచేసి రెండు లక్షల ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. టీడీపీ తరుపున పోటీచేసిన ఎర్రం నాయుడు గెలవగా కాంగ్రెస్ తరుపున పోటీచేసిన ధర్మాన ప్రసాద్ రావ్ మూడోస్థానానికి పడిపోయాడు.
ఆ దెబ్బతో జయకృష్ణను మచ్చిక చేసుకోవాలని చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఆయన చంద్రబాబును దూరంగా పెట్టాడు. ఏదో శుభకార్యాలలో కలవటం తప్ప చంద్రబాబుతో రాసుకు పూసుకు తిరిగింది లేదు.

ఇప్పుడు తమ కులానికే చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ తిడుతుంటే గతంలోలాగ విమర్శించిన వారిని అదే కులానికి చెందిన నాయకులతో తిట్టించే ఎత్తుగడ చెల్లక వార్ల రామయ్యతో, బీద రవిచంద్రతో చంద్రబాబు ఎదురు దాడి చేయించాడు కానీ పెద్ద స్పందన రాలేదు.
కనీసం తన కుటంబలో నుంచైనా ఎదురుదాడి చేయిద్దాం అనుకుంటే లోకేష్ ఆనడు అనుకొని కొత్త వాళ్ళతో అయితే మంచిదని తనతో 24 సంవత్సరాలుగా సంబధాలు లేని జయకృష్ణ

కొడుకు చైతన్య కృష్ణతో కొడాలి నానీకి,వంశీకి కౌంటర్ ఇప్పించాడు. చైతన్య గట్టి వార్నింగ్ ఇద్దామనుకున్నాడు కానీ మాటలో గాంభీర్యం లేక,పైగా మాట తడబాటుతో ప్లీజ్ ప్లీజ్ అన్నట్లు ఉంది కానీ కేర్ఫుల్ అన్న హెచ్చరికలాగా అనిపించలేదు.

Also Read: మత మార్పిడి - గుంటూరు హిందూ,ముస్లిం మరియు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలు

గతంలో జయకృష్ణ చంద్రబాబును తిట్టిన తిట్లు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు చైతన్య కృష్ణ తెర మీదికి రావటంతో కొడాలి నాని పాత రికార్డులు బయటకు తీస్తే అరంగేట్రమే అంతిమ ప్రదర్శన అయ్యే ఆవకాశం ఎక్కువ.

తెలంగాణా ఎన్నికల్లో హరికృష్ణ కూతురు, ఇప్పుడు జయ కృష్ణ కొడుకు.. ఒకే అవసరానికి ఎన్టీఆర్ వారసుల్లో ఎవరో ఒకరి చంద్రబాబుకు కలిసి వస్తున్నారు.
వీళ్ళ గొడవ ఎట్లున్నా.. మంత్రులు తిట్టమాకండయ్యా,ఇప్పుడు మీరు బాధ్యతాయుత పదవుల్లో ఉన్నారు... కొంచెం ధాటి తగ్గించి మాట్లాడండి.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News