దిశ చట్టం అమలు దిశగా కేంద్రం ముందడుగు

By Suresh Jul. 31, 2021, 08:15 am IST
దిశ చట్టం అమలు దిశగా కేంద్రం ముందడుగు

సమాజంలో మహిళలు,బాలికలపై లైంగిక దాడులు,అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఢిల్లీ నిర్భయ,యూపీ ఉన్నావ్ ఘటన,తెలంగాణ దిశ ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇటువంటి కేసులలో న్యాయం జరిగేందుకు ఏళ్ళు పడుతుండడంతో మహిళలపై, చిన్నారులపై హత్యచారాలు, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం దిశ చట్టం-2019ని 13 డిసెంబర్,2019న తీసుకువచ్చింది. తెలంగాణలో జరిగిన దిశ ఘటనపై కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పొగుడుతూ ఏపీలో కూడా కఠిన చట్టం అమలు చేయాలని దిశ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ద్వారా నేరాలకు పాల్పడే వారిపై సత్వరమే కఠిన చర్యలు తీసుకునే విధంగా క్రిమినల్ లాను సవరించాలని చట్టం తీసుకువచ్చింది.

ఈ చట్టం ప్రకారం మహిళలు,బాలికలపై అఘాయిత్యానికి పాల్పయితే బలమైన సాక్షాలు దొరికితే 21 రోజుల్లో మరణశిక్ష ఖరారు అయ్యేలా చట్టం తీసుకువచ్చారు. మహిళలపై సోషల్ మీడియాలో కించపరివిధంగా పోస్టులు పెడితే 2సంవత్సరాల జైల్ శిక్ష.. పిల్లలపై లైంగికదాడికి పాల్పడితే నేరతీవ్రతను బట్టి 20సంవత్సరాల వరకు జైల్ శిక్ష విధించేలా దిశ చట్టం 2019ని తీసుకువచ్చింది. అత్యాచార కేసుల్లో 21రోజుల్లో ఉరిశిక్ష పడేలా ఏపీ క్రిమినల్ లా చట్టం 2019,స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్-2019 ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఐపీసీ354కు సవరణలు చేస్తూ 354E ని చేర్చింది. అసెంబ్లీ ఆమోదించిన దిశ బిల్, క్రిమినల్ లా సవరణ బిల్లును ఆమోదం కోసం కేంద్రానికి పంపింది ప్రభుత్వం.

దిశ పరిధిలోకి వచ్చే నేరాలు..
మహిళలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, వేధింపులు, యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, చిన్నారులపై లైంగిక దాడులు దిశ పరిధిలోకి వస్తాయి.

దిశ చట్టం అమలుకు ప్రభుత్వం కృషి...
దిశ చట్టాన్ని అమలుకోసం రాష్ట్రవ్యాప్తంగా18 దిశ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాజమండ్రిలో మొదటి దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారభించారు ముఖ్యమంత్రి జగన్. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వీళ్లంతా 24 గంటలూ... మహిళల భద్రత కోసం పనిచేస్తారు.
దిశ చట్టాన్ని అమలు చేయడానికి దిశ యాప్ ను ఫిబ్రవరి2020లో తీసుకువచ్చింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. జూన్29 2020 నాడు కృష్ణ జిల్లా గొల్లపూడి లో దిశ యాప్ మీద అవగాహన సభ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు, బాలికలు యాప్ ఇంస్టాల్ చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటి వరకు దాదాపు కోటి70లక్షల మంది దిశ అప్ డౌన్లోడ్ చేసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ పంపిన దిశ చట్టానికి సంబంధించిన బిల్లులపై వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడగిన ప్రశ్నకు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో జవాబు ఇచ్చారు."ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులను పరిశీలించిన అనంతరం హోం శాఖ తమ అభిప్రాయాలను తెలుపాలని కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు బిల్లును పంపింది. హోం శాఖ పంపిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు - క్రిమినల్‌ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉద్దేశంగా రూపొందించిన బిల్లులపై తమ శాఖ అభిప్రాయాలను జోడించి తదుపరి ఆమోదం కోసం హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు" ఆమె తెలిపారు.

దిశ బిల్లుపై అభిప్రాయాలను కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ బిల్లుపై వెల్లడించిన అభిప్రాయాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం కొన్ని వివరణలు కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరణలను జత చేస్తూ తిరిగి హోం మంత్రిత్వ శాఖ ఆ బిల్లును మా మంత్రిత్వ శాఖకు పంపించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మా మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను క్రోడీకరించి తిరిగి గత జూన్‌ 15న ఈ బిల్లును హోం మంత్రిత్వ శాఖకు పంపించినట్లు స్మృతి ఇరానీ వెల్లడించారు.హింసకు గురవుతూ ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్మృతి ఇరానీ తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp