బాబు, ఆర్కేకి హార్ట్ బ్రేకింగ్ న్యూస్...

By Ravoori.H Dec. 02, 2019, 07:42 am IST
బాబు, ఆర్కేకి హార్ట్ బ్రేకింగ్ న్యూస్...

ఎపికి ఐదు లక్షల కోట్ల పెట్టుబడులునిజంగా హార్ట్ బ్రేకింగ్ న్యూస్‌నే. చంద్రబాబు, రాధాకృష్ణలు తట్టుకోగలరా? వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచీ ఇంకా చెప్పాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచిన మరుక్షణం నుంచీ కూడా వైఎస్ జగన్‌ని ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ఎలా చిత్రీకరించాలి? కనీసం ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని ప్రజలను ఎలా నమ్మించాలి? ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు తప్ప వేరే దిక్కులేదు. ఆంధ్రప్రదేశ్‌ని పాలించే అర్హత మా.చంద్రబాబుకు మాత్రమే ఉందని ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడం ఎలా అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆరు నెలలుగా కష్టపడుతూనే ఉన్నారు చంద్రబాబు అండ్ రాధాకృష్ణ. పనిలో పనిగా పవన్ కళ్యాణ్‌ని కూడా ఉపయోగించుకుంటున్నారు.

అయితే అవినీతి ముద్ర వేయాలంటే జగన్ ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఇక ఫ్యాక్షనిస్ట్ అందామా అంటే చంద్రాబు అండ్ కో తప్ప రాష్ట్రం అంతా ప్రశాంతంగానే ఉంది. ఇక మిగిలింది మతం ముద్రవేయడం. ఆ ప్రయత్నాలు దిగ్విజయంగా చేస్తూనే ఉన్నారు.సంక్షేమ పథకాలతో ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి అభివృద్ధి, భవిష్యత్ తరాలు, వందేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటూ జగన్ వలన ఇప్పుడు బాగానే ఉన్నా భవిష్యత్‌లో నష్టం జరుగుతుంది అని కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. దీనికి ఇప్పటికీ బాబు అడుగుజాడల్లో నడుస్తున్న సుజనా చౌదరిని వాడుకుంటున్నారు. సుజనా చెప్తే మోడీ చెప్పినట్టే అన్నంత కలర్ ఇస్తున్నారు.

అయితే ఇప్పుడు సుజనాకంటే బిజెపిలో ఎంతో సీనియర్, మోడీ-అమిత్‌ షాలకు సన్నిహితుడైన సోమూ వీర్రాజు ఆంధ్రప్రదేశ్‌కి ఒక తీపి వార్త చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కి మంచి చేసే వార్త అంటే చంద్రబాబు అండ్ కోకి ఎలాంటి బ్రేకింగ్ అవుతుందో వాళ్ళ మాటలు, చేతలు చూసేవారికి ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది.

అన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్‌లో ఐదులక్షల కోట్ల పెట్టుబడులు పెట్టుబడి పెట్టడానికి కేంద్రప్రభుత్వం ప్రణాళికలకు రచిస్తోందని స్వయంగా బిజెపి సీనియర్ నాయకుడు చెప్పడం అంటే ఎక్కడ జరిగిపోతుందో అనే భయం బాబు & Co కి ఓ రేంజ్‌లో పట్టుకుందనడంలో సందేహం లేదు. అయితే బిజెపి మాటలను ఇప్పుడు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదనుకోండి. అది వేరే విషయం. కానీ ఇదే మాటలను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా బిజెపి కేవలం మాటగా చెప్పినా కూడా ఐదు లక్షల కోట్లు వచ్చేసినట్టే....బాబు తెచ్చేసినట్టే అనే రేంజ్‌లో హంగామా చేసేవారనడంలో మాత్రం సందేహం లేేదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంత అభివృద్ధికి నరేంద్రమోడీ ప్రణాళికలు రచిస్తున్నాడని బిజెపి నేతలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టబోతోందని చెప్తున్నారు. అదే జరిగితే మాత్రం రాజకీయాలు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ జాతకమే మారిపోతుందనడంలో సందేహం లేదు. 1000 కిలోమీటర్ల సముద్రతీరం...10 కి పైగా ఓడ రేవుల వికాసానికి అవకాశం...తూర్పుఆసియా దేశాల తో డైరక్ట్ సీరూట్... సోమువీర్రాజుగారు చెప్పిన మాట ఎన్నో ఆశలు రేపుతున్నది. అదే నిజమైతే ఎపి ఆర్ధిక స్ధితిగతులు గొప్పగా మారిపోవడం ఖాయం. హోదా విషయంలో యూ టర్న్ తీసుకున్న మోడీ ఇలా అయినా ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేస్తాడేమో చూడాలి మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp