రాజకీయ నిరుద్యోగి ఉత్తమ సంజాత పురుష్

By KalaSagar Reddy 20-11-2019 01:52 PM
రాజకీయ నిరుద్యోగి ఉత్తమ సంజాత పురుష్

ప్రస్తుతం చంద్రబాబు వల్లెవేస్తున్న నీతులు వింటుంటే బాబు గారి గురించి టీడీపీ నేతల వాక్ శుద్ధి గురించి తెలిసిన వారికెవరికైనా వృద్ధనారీ పతివ్రత సామెత పోయి "రాజకీయ నిరుద్యోగి ఉత్తమ సంజాత పురుష్" అని కొత్త సామెత స్ఫురణకు వస్తుందేమో
బాబు గారి నేటి నీతులు :
బూతులు తిట్టడం కష్టం కాదు ...
నిగ్రహం పాటించడమే కష్టం ...
అదే తెలుగుదేశం పార్టీ చేస్తుంది ...

మంచి సలహాలు. అందరు ఈ విలువలు పాటించాలి కానీ సూక్తులు చెప్పేవారు ముందుగా వాటిని పాటించి ఎదుటివారికి ఆదర్శంగా నిలవాలి. కానీ అధికారములో ఉన్నపుడు చంద్రబాబు దృతరాష్ట్ర నీతి పాటించాడు. ఆయనకు కనపడలేదు ,ఈయనకు వినపడలేదు.
జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు ప్రెస్ మీట్ లో చంద్రబాబు ... ఏం చేశాడు వాడు ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఇంటికెళ్లాడు వాడు అంటిరే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతని అనే మాటలా ఇవి. అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా , ఏయ్ పాతేస్తా నాకొ..కా అని ప్రతిపక్ష నేతని ఉద్దేశించి అన్నప్పుడు, బోండాని ఆపి ఉంటే హుందాగా ఉండేది .

ఇహ చింతమనేని లం ..... కొ..కా అంటూ బూతుపురాణాలు తిట్టినప్పుడు , పలువురి పై దాడి చేసినప్పుడు , మీకెందుకురా రాజకీయాలు అని sc లని ఉద్దేశించి అన్నప్పుడు, అతని పై చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఇన్ని కేసులు ఉండేవి కావు. 66 రోజులు జైలు జీవితం గడిపేవాడు కాదు .
కనీసం జేసీ ప్రభాకర రెడ్డి నడిరోడ్డు మీద కూర్చొని అమ్మా , అక్కా , నా కొ..కా అంటూ పచ్చి బూతు పురాణం అందుకొన్నప్పుడు చోద్యం చూసినట్టు చూడకుండా హెచ్చరించి అదుపులో పెడితే నేడు మీ నీతులకి విలువ ఉండేదేమో . నాడు అసెంబ్లీలో జగన్ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడివైతే అంటూ సవాళ్లు విసిరినప్పుడు మీరు కానీ , సభాపతి కానీ ఖండించి ఉంటే కనీసం అసెంబ్లీ మర్యాద అయినా కాపాడిన వారయ్యేవారు .

లోకేష్ ట్విట్టర్ వేదికగా కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డి అంటూ చేసిన వికటహాస్యాలు ఇంకా సాక్ష్యాలుగా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి . కోడి కత్తి డ్రామా , కోడి కత్తి పార్టీ , జగన్మోడి లాంటి పైత్యపు రాతలు రాయకుండా వారించి ఉండాల్సింది బాబు గారూ .
మర్డర్ మేం ప్లాన్ చేస్తే ఇలా ఉండదు అయిపోతారు అంటూ మంత్రి సోమిరెడ్డి హెచ్చరికలు వినని వారున్నారా . పార్టీ పగ్గాల కోసం విజయమ్మ , షర్మిళలే జగన్ పై హత్యాయత్నం చేయించారని యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ నీచంగా మాట్లాడినప్పుడు కనీసపు చర్యలు తీసుకొవలసింది .
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా బాబు గారూ.., మీరు మీ నాయకులు ఇలా బూతులు , కుసంస్కార వ్యాఖ్యలు చేస్తుంటే మీ కార్యకర్తలు సంస్కారవంతంగా మాట్లాడతారా , నన్నారి నర్సిరెడ్డి అని తెలంగాణా యువనాయకుడు , టీడీపీ మహానాడులో చేసిన అత్యంత దిగజారిన వ్యాఖ్యలకు నవ్వుకున్నారే కానీ అతన్ని ఆపలేదు. .

నర్సి రెడ్డి , పక్క రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ క్యాబినెట్ లో మినిస్టర్లు అందరూ ఆడంగులని , కేసీఆర్ భార్యనుద్దేశించి జరా ముసల్ది లేవదు అంటూ నర్సిరెడ్డి కూసిన కారు కూతలకు మీరు చిరునవ్వులు చిందించకుండా ఉంటే కొంచమైనా మర్యాద మిగిలి ఉండేది . ఇదే నర్సిరెడ్డి జగన్ దేవుడి కుర్చీలు , హుండీ దొంగతనం చేస్తాడని జగన్ ని , దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడినప్పుడు పగలబడి నవ్వినప్పుడు చూసిన జనం ఇవాళ మీ నీతులు చూసి హవ్వ అని నోరు నొక్కుకోకుండా ఉంటారా .

ఇంకా ఆయా ప్రాంతాల టీడీపీ ప్రతినిధుల బూతు పురాణాల వీడియోలు , న్యూస్ క్లిప్పింగ్ లు ఎక్కడికీ పోలేదు,సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి .ఇవాళ వృద్దనారీ పతివ్రత , బాబు సంస్కార నేత లాంటి డప్పు ఎంతకొట్టుకున్న గతం వెంటాడుతుంది. చంద్రబాబు నిగ్రహ సంస్కార పాఠాలు కనీసం టీడీపీ నేతల చెవులకన్నా ఎక్కుతాయా?

సద్విమర్శ ఎవరు చేసినా మంచిదే . హద్దులు దాటిన వ్యాఖ్యలు టీడీపీ చేసినా , వైసీపీ చేసినా తప్పే . రాజకీయాల్లో హుందాతనం పెంపొందాలంటే నాయకులు నోరు అదుపులో ఉంచుకోవాల్సిందే .రేపు డిసెంబర్ రెండు నుండి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హుందాగా జరగాలని కోరుకొందాం .

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News