జ‌గ‌న్ ను కాద‌ని.. ప‌వ‌న్ ను సీఎం చేసే చాన్స్ ఉందా?

By Kalyan.S Oct. 13, 2021, 07:45 am IST
జ‌గ‌న్ ను కాద‌ని.. ప‌వ‌న్ ను సీఎం చేసే చాన్స్ ఉందా?

 జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌నీసం ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేక‌పోయారు. గ‌తంలో రాజ‌కీయాలు చేయ‌లేద‌ని, ఇప్పుడు కొత్త రాజ‌కీయాలు చేసి అధికారంలోకి వ‌స్తాన‌ని కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు ప‌వ‌న్. ముందు మీరు అధికారం ఇవ్వండి.. త‌ర్వాత మీకు స‌రికొత్త పాల‌న‌ను ప‌రిచ‌యం చేస్తానంటూ ఇప్ప‌టి నుంచే హామీలు గుప్పిస్తున్నారు. అధికారం ఇవ్వ‌క‌పోతే ప్ర‌జ‌ల కోసం పోరాడ‌న‌న్న (విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో) సంకేతాలు కూడా ఇస్తున్నారు. ప‌వ‌న్ తాజా రాజ‌కీయాల నేప‌థ్యంలో జ‌న‌సైనికులు కూడా కొత్త క‌ల‌లు కంటున్నారు. నెక్స్ట్ టైం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ప్ప‌నిస‌రిగా సీఎం అవుతార‌ని, న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు మొద‌టి సారి చంద్ర‌బాబుకు, రెండో సారి జ‌గ‌న్ కు అధికారం ఇచ్చిన ప్ర‌జ‌లు ఈసారి ప‌వ‌న్ ను గెలిపిస్తార‌ని ఊహ‌ల‌ప‌ల్ల‌కిలో తేలియాడుతున్నారు.

మూడో పార్టీకి చాన్స్ ఉందా?

నిజం చెప్పాలంటే.. దేశంలో ఏ రాష్ట్రానికి పట్టని అవస్థలు ఏపీకే పడుతున్నాయి. ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయిన దగ్గర నుంచి తీసుకుంటే ఉమ్మడి ఏపీ నుంచి వేరు పడినదాకా ఏపీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడింది అన్నది అందరికీ ఎరుకే. ఇక ఏడేళ్ల విభజన ఏపీలో ఆంధ్రులు మరింతగా దెబ్బ తిన్నారు. తొంబై వేల కోట్ల రూపాయల అప్పులతో ఏపీ ఏర్పడింది. గ‌త పాల‌కుల‌కు ముందు చూపు లేక‌పోవ‌డ‌మే దీనికంతటికీ కార‌ణ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదాతో సహా అనేక విభజన హామీల మీద కేంద్రం చెప్పిన మాటలను అన్నీ తప్పేసింది. పైగా రెవిన్యూ లోటుని కూడా ఈ రోజుకీ తీర్చలేదు. అయిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న స‌మ‌ర్ధ‌త‌తో ఏపీలో సంక్షేమ రాజ్యాన్ని కొన‌సాగిస్తున్నారు. ఆయ‌న పాల‌నకు అమిత ఆద‌ర‌ణ చూపుతున్నారు. ప‌రిస్థితి ఇలా ఉంటే.. కొత్త‌గా మూడో పార్టీ జ‌న‌సేన అధికారం కోసం క‌ల‌లు కంటుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : చంద్రబాబు కుప్పం పర్యటన ఎందుకు రద్దు అయింది...?

ఆలోచించాల్సిన విష‌య‌మే..

ఏపీ ప్రజలు తొలి అయిదేళ్ళూ చంద్రబాబుని అనుభవం అన్న కారణంతో ఎన్నుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న పాల‌న‌లో పైపై మెరుగులు త‌ప్పా ఎవ‌రికీ ల‌బ్ది చేకూర‌లేద‌ని విసిగిపోయారు. ప్ర‌ధానంగా ఉద్యోగాలు లేక యువ‌త నిరుత్సాహానికి గుర‌య్యారు. దీంతో జగన్ కు పట్టం కట్టారు. జ‌గ‌న్ తొలి ఆరు నెల‌ల్లోనే ఆరున్న‌ర ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసి సంచ‌ల‌నం సృష్టించారు. ఇప్ప‌టికీ ఉద్యోగాల భ‌ర్తీలు జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌రోవైపు రెండు సార్లు ఎంపీగా, అయిదేళ్ళు విపక్ష నేతగా పనిచేసిన అనుభవంతో సంక్షేమ పాల‌న‌ను స‌మ‌ర్ధ‌వంతంగా సాగిస్తున్నారు. అలాంటి వ్య‌క్తిని కాద‌ని ప్ర‌జ‌లు ప‌వ‌న్ కు ప‌ట్టం క‌ట్ట‌డం సాధ్య‌మేనా అన్న‌ది ఆలోచించాల్సిన విష‌యం. జ‌గ‌న్ తో పోలిస్తే పవన్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు పైగా ఆయన పూర్తిగా ప్రజా ప్రతినిధిగానే కొత్త అవుతారు. మరి ఆయన్ని తెచ్చి సీఎం ని చేయడానికి ఏపీ జనాలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సిద్ధంగా ఉండ‌ర‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుతో పాటు అయిదేళ్ళు పాలించిన జగన్ ల మధ్యనే ఏపీలో మరో మారు రాజకీయ సమరం సాగే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పొత్తులతో ముందుకు వస్తే కాస్తో కూస్తో ప్రభావం చూపించవచ్చు అన్నది కూడా మ‌రో విశ్లేషణ. అలా కాకుండా మూడో పార్టీగా బ‌రిలోకి దిగితే గ‌త ఎన్నిక‌ల అనుభ‌వ‌మే ఎదురుకావ‌చ్చున‌ని, రాజకీయంగా ఇబ్బందే అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి ప‌వ‌న్ కొత్త రాజ‌కీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Also Read : పొత్తు కుదిరితే.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేల‌కు తిప్ప‌లే..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp