బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి.. యువత లో జోష్..

By Ritwika Ram Jul. 17, 2021, 03:40 pm IST
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి.. యువత లో జోష్..

ఆంధ్రప్రదేశ్ లో పదవుల పండుగ వచ్చింది. ఏకంగా 135 కార్పొరేషన్లు, అథారిటీలు, సొసైటీలు, ఇతర సంస్థలకు చైర్మన్లు/ఛైర్పర్సన్ల ను  నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందులో రాయలసీమకు 43 పదవులు ఇవ్వగా.. అందులో 24 మందికి రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చారు. అత్యధికంగా చిత్తూరుకు 12 పోస్టులు దక్కాయి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఓడిన వాళ్లు, టికెట్ దక్కని వాళ్లు, ఇతరుల కోసం టికెట్ వదులుకున్న వాళ్లకు ప్రాధాన్యం దక్కింది. కర్నూలు నుంచి వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ప్రాతినిథ్యం దక్కింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఆయన నియమితులయ్యారు.

యువ సంచలనం.. సిద్ధార్థరెడ్డి

కర్నూలు జిల్లా రాజకీయాల్లో బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి ఓ సంచలనం. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత. ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంటారు. చిన్న వయసులోనే నందికొట్కూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ గా బాధ్యతలు తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. ఆర్థర్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. సిద్ధార్థ్‌ కు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని స్థానిక ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చెప్పారు. బైరెడ్డికి మంచి ప్రాధాన్యత గల పోస్ట్ ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా ఆ హామీని నెరవేర్చారు. రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పజెప్పి మాటనిలబెట్టుకున్నారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా సిద్ధార్థరెడ్డిని నియమించారు.

కర్పూల్ నుంచి 10మందికి..

బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు కర్నూలు నుంచి మొత్తం 10 మందికి పలు బాధ్యతలను జగన్ సర్కారు అప్పగించింది. రాష్ట్రస్థాయిలో ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్ పర్సన్ గా పి.భాగ్యమ్మ, ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ గా పి.పెద్ద నాగిరెడ్డి, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ గా కర్రా గిరిజ, ఏపీ మీట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఎం. శ్రీరాములు, ఆయిల్ ఫెడరేషన్ చైర్ పర్సన్ గా షేక్ గౌసియా బేగం నియమితులయ్యారు. ఇక జిల్లా స్థాయిలో కర్పూల్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా కోట్లా హర్షవర్ధన్ రెడ్డి, డీసీసీబీ చైర్ పర్సన్ గా ఎస్. మహాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎం. సుబాష్ చంద్ర బోస్, డీసీఎంఎస్ చైర్ పర్సన్ గా చెంచెన్నగారి శిరోమణి నియమితులయ్యారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp