పడవ బోల్తా - ఏడుగురి దుర్మరణం

By Kiran.G Sep. 16, 2020, 03:47 pm IST
పడవ బోల్తా - ఏడుగురి దుర్మరణం

చంబల్ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మ‌ర‌ణించగా మ‌రో 14 మంది గ‌ల్లంత‌య్యారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా జిల్లాలో సంభవించింది.

వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని కోట జిల్లాలో పరిమితికి మించిన ప్రయాణీకులను ఎక్కించుకున్న పడవ చంబ‌ల్‌ న‌దిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా మరో 14 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. పడవ బోల్తా పడటాన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై మునిగిపోతున్న బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘ‌టనాస్థ‌లికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్ప‌టికే ఏడు మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశాయి.

చంబల్ నదిలో బోల్తా పడిన ప‌డ‌వ‌లో మొత్తం 25 నుంచి 30మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక బృందాలతో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.కాగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకురాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గ‌హ్లోత్ సంతాపం వ్య‌క్తం చేశారు. ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘట‌న అని, అధికారుల‌తో మాట్లాడి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా పడవ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp