ప్రభుత్వ వెబ్సైట్ హ్యాక్ - అడ్డంగా దొరికిన బ్లూఫ్రాగ్‌

By Kotireddy Palukuri 13-11-2019 09:00 PM
ప్రభుత్వ వెబ్సైట్ హ్యాక్ - అడ్డంగా దొరికిన బ్లూఫ్రాగ్‌

ఎన్నికల సమయం లో వెలుగులోకి వచ్చిన డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖకు చెందిన బ్లూఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీ సంస్థ మరో చోరీలో అడ్డంగా దొరికింది. ఇసుక సరఫరా సంబంధిత వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసినట్లు అనుమానం రావడంతో సీఐడీ, పోలీసులు సంస్థ సర్వర్లలోని డేటాను తనిఖీలు చేశారు. బ్లూ ఫ్రాగ్‌ సంస్థకు చెందిన పలువురు వ్యక్తులు ఇసుక ఆన్లైన్ బుకింగ్ చేసేసుకునె సైట్‌ను హ్యాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించినట్లు సీఐడీకి ఫిర్యాదు అందాయి. 

రంగంలోకి దిగిన సీఐడీ విశాఖలో ఉన్న బ్లూ ఫ్రాగ్స్ కార్యాలయంలో సోదాలు చేసింది. స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. స్టాక్‌యార్డ్‌లో పెద్దఎత్తున ఇసుక ఉన్న కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే ఇసుక లేనట్లు చూపించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థ రూపొందించినట్లు సీఐడీ విచారణలో తేలింది. కంపెనీ సర్వర్లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. గతంలో మన శాండ్‌ సైట్‌ను బ్లూఫ్రాగ్‌ సంస్థనే నిర్వహించింది.

కాగా, ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.ఇసుక అక్రమాలకు పాల్పడితే రూ.2లక్షల వరకూ కనీస జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ గణుల చట్టంలో సవరణలకు నేడు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.


idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News