బీజేపీలో ఏం జ‌రుగుతోంది..? ఆరు నెల‌ల్లో నలుగురు సీఎంల మార్పు

By Kalyan.S Sep. 13, 2021, 09:20 am IST
బీజేపీలో ఏం జ‌రుగుతోంది..? ఆరు నెల‌ల్లో నలుగురు  సీఎంల మార్పు

ఒక‌రిద్ద‌రు కాదు.. ఆరు నెల‌ల కాలంలో ఏకంగా ఐదుగురు ముఖ్య‌మంత్రుల‌ను మార్చేశారు బీజేపీ పెద్ద‌లు. గుజ‌రాత్ నూత‌న సీఎంగా భూపేంద్ర ప‌టేల్ నియామ‌కంతో ముఖ్య‌మంత్రుల మార్పు అంశంపై జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఇదంతా.. మూడోసారి కూడా ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌ని భారీ స్థాయిలో క‌స‌ర‌త్తు చేస్తున్న బీజేపీ వ్యూహంలో భాగ‌మా, పార్టీలో అంత‌ర్లీనంగా చెల‌రేగుతున్న చిచ్చుకు ప్ర‌తిరూప‌మా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇట్టే మార్చేస్తున్న ఘ‌ట‌న‌లు ఇటీవ‌లి కాలంలో చాలానే చోటుచేసుకున్నాయి. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తాజాగా అక్కడి సీఎం విజయ్ రూపాణిని ఇంటికి పంపి.. కొత్త ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ మాటకు వస్తే గడిచిన ఆరు నెల‌ల కాలంలో ఐదు రాష్ట్రాల్లోని బీజేపీ ముఖ్యమంత్రుల్ని మార్చేశారు. గుజరాత్ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటం.. ఇప్పటికే మూడుసార్లు వరుస విజయాలు సాధించి.. బీజేపీకి కంచుకోటలా ఉన్న రాష్ట్రంలో విజయ్ రూపాణి మీద ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరగటంతో నష్ట నివారణ ప్రయత్నాల్ని షురూ చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే విజయ్ మీద వేటు వేసినట్లుగా చెబుతున్నారు. పార్టీ క్యాడర్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటు.. తమకు వచ్చిన నివేదికల ఆధారంగానే ముఖ్యమంత్రిని మార్చాలని మోడీషాలు డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

Also Read:గుజరాత్ కొత్త సీఎం భూపేంద్ర పటేల్

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా వచ్చే ఏడాది జరిగే కీలక రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలు మారనున్నాయి. ఉత్తరప్రదేశ్.. గుజరాత్.. ఉత్తరాఖండ్.. గోవాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిల్లో మొదటి నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. అధికారపక్షంగా ఉండే సహజ వ్యతిరేకతను అధిగమించటానికి.. విజయాన్ని మరోసారి సొంతం చేసుకోవటానికి వీలుగా.. నాయకత్వ మార్పుతో అసంతృప్తిని అధిగమించాలని ప్ర‌ధాని మోదీ, అధ్య‌క్షుడు అమిత్ షా భావిస్తున్నట్లుగా ప‌లువురు భావిస్తున్నారు.

తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని ఇట్టే మార్చేసే వైనానికి తెర తీసింది ఉత్తరాఖండ్ లోనే. అక్కడ సీఎంగా వ్యవహరిస్తున్న త్రివేంద్ర సింగ్ రావత్ ను తప్పించి.. ఆయన స్థానంలో తీరథ్ సింగ్ రావత్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే.. తాము ఆశించిన రీతిలో ఆయన పాలన లేకపోవటంతో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆయనపై వేటు వేసి.. పుష్కర్ సింగ్ ధమీని ముఖ్యమంత్రిని చేశారు. ఇలా నాలుగునెలల వ్యవధిలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చిన వైనం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్కర్ సింగ్ ధమీ నాయకత్వంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కోనున్నారు.

Also Read: నక్సలైట్లు మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళ రెడ్డిని ఎందుకు చంపారు?

మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఎన్నికల వేళ పార్టీకి నాయకత్వం వహించిన నేతను వదిలేసి.. మరో నేతకు ముఖ్యమంత్రి అవకాశాన్ని ఇవ్వటం చాలా సాహసోపేతమైన చర్య. అసోంలో అలాంటి పనే చేసింది మోడీషాల ద్వయం. అసోంలో పార్టీని విజయతీరాలకు చేర్చిన ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్ ను తప్పించి.. ఆయన స్థానంలో హిమంత బిశ్వశర్మకు అవకాశం ఇచ్చింది. అదే సమయంలో ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తప్పించిన శర్బానందను కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించారు.

కర్ణాటకలోనూ అలానే జరిగింది. ఎన్నికల్లో గెలుపు చేతి వరకు వచ్చి చేజారింది. ఇలాంటివేళ.. యడ్డీ నాయకత్వంతో ఆపరేషన్ కమల్ ను విజయవంతంగా పూర్తి చేసి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి మరీ.. బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంది. తాము అనుకున్నట్లుగా లక్ష్యానికి రీచ్ అయిన యడ్డీని సీఎంను చేశారు. కానీ.. ఆశించిన రీతిలో ఆయన పాలన లేదన్న కారణంగా ఆయన్ను పక్కన పెట్టేసి.. బసవరాజ్ బొమ్మైని సీఎంగా చేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా పలు రాష్ట్రాల్లో సీఎంలను సింఫుల్ గా మార్చేసిన మోడీషాలు..తాజాగా తమ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనూ ముఖ్యమంత్రిని కుర్చీలో నుంచి దించేశారు. ఇలా ప‌లు రాష్ట్రాల సీఎంల‌ను మార్చేసిన బీజేపీ ఎత్తుగ‌డ ఫ‌లిస్తుందా లేదో చూడాలి.

Also Read:టీడీపీ అనుకున్న‌దొక‌టి.. జరిగింది మరొకటి..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp