GVL - అప్పులు - నిజాలు: రాష్ట్రం చెబుతోంది.. మరి కేంద్రం? - జీవీఎల్

By Prasad Dec. 04, 2021, 09:30 pm IST
GVL - అప్పులు - నిజాలు:  రాష్ట్రం చెబుతోంది.. మరి కేంద్రం? - జీవీఎల్

‘గురివింద గింజ తన కింద ఉన్న నలుపును గుర్తించదు’ అన్న చందాన ఉంది ఉభయ తెలుగు రాష్ట్రలకు చెందిన బీజేపీ నాయకుల తీరు. తాము చేసే పని లోకకళ్యాణార్ధమని.. అదే పని ఎదుటివారు చేస్తే విద్రోహచర్యగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ జి.వి.ఎల్‌.నరసిహారావు ప్రెస్‌మీట్‌ చూసినవారికి ఈ సామెత చప్పున గుర్తుకు వస్తుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. తొలి ఐదేళ్లలో ఇంత? తరువాత రెండున్నరేళ్ల మరికొంత? అని ఏపీ అప్పులు ప్రస్తావించిన ఆయన గడిచిన ఏడున్నరేళ్ల కేంద్రంలో తమ బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాటమాత్రమైన ప్రస్తావించకపోవడం విడ్డూరం.

బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జి.వి.ఎల్‌.నరసింహారావు విలేకరులతో మాట్లాడుతూ ఏపీ అప్పుల గురించి విమర్శలు గుప్పించారు. ఆయన విమర్శలు ఇలా సాగాయి... ‘రాష్ట్ర విభజన సమయానికి ఉన్న అప్పులకన్నా గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రెట్టింపు అప్పులు చేసింది. జగన్‌ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలోనే చంద్రబాబు చేసిన అప్పులతో సమానంగా అప్పులు చేసింది. తద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా చేసే పరిస్థితికి తీసుకువచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. పైగా కేంద్రం ఇచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోంది’ అని ఆరోపణలు చేశారు.

రాష్ట్రం అప్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుత్వం బహిరంగంగా వెల్లడిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో కోవిడ్‌ రావడం, ఆర్థిక స్థితి అస్తవ్యస్తం కావడమంటోంది. ఆదాయం దారుణంగా పడిపోయింది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం, గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు భారీగా వడ్డీ చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వం అప్పులు చేయాల్సి వచ్చింది.

Also Read : Up - ఉత్తరప్రదేశ్‌... అస్థిరత్వం నుంచి స్థిరత్వం వైపు...

ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టో హామీలు అమలు చేస్తున్నారు. ఈ నగదు బదిలీ పథకాల వల్లే కోవిడ్‌ సమయంలో ఆకలి చావులు చోటు చేసుకోలేదు. మనీ సర్కుల్యేట్‌ అవడం వల్లే అన్ని వ్యవస్థలు నడిచాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఆర్థిక వేత్తలు చెప్పింది కూడా కోవిడ్‌ సమయంలో ప్రభుత్వాలు మనీ సర్క్యులేట్‌ చేయమనే. అప్పులు చేస్తున్న విషయం రాష్ట్రంలోని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం దాయడం లేదు. బహిరంగంగానే ప్రకటిస్తోంది. ఇందుకు కారణాలు కూడా వివరిస్తోంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా భారీగానే అప్పులు చేసింది. నరేంద్ర మోడీ అధికారంలోకి రాక ముందు కేంద్రం చేసిన అప్పులు రూ.50 లక్షల కోట్లు, మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇది కాస్తా రూ.1.30 లక్షల కోట్లకు చేరింది. ఏడేళ్లలో అక్షరాలా రూ.80 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఈ విషయాన్ని జీవీఎల్‌ తన ప్రెస్‌మీట్‌ లో ప్రస్తావించలేదు.

కేంద్ర ప్రభుత్వం కనీసం చేసిన అప్పుల మీద నిజాలు ఒప్పుకున్న సందర్భం లేదు. సరి కదా ఎందుకు ఖర్చు పెట్టారో కూడా వివరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో 1.30 లక్షల కోట్లు వివిధ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లలో జమ చేశారు. అది కూడా చాలా పారదర్శకంగా. కేంద్రం అలా చెప్పిన సందర్భం లేదు. పైగా కోవిడ్‌ వచ్చిన తరువాత పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది. అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరలకు తగిన విధంగా వీటి ధరలు తగ్గించాల్సి ఉంది. కాని రెట్టింపు చేసి మోడీ ప్రభుత్వం సామాన్యులను కొల్లగొట్టింది. ఇలా ఏడాదికి రూ.5 లక్షల కోట్లు అదనంగా ఆర్జించింది. ఇన్ని లక్షల కోట్లు దేనికి ఎంత ఖర్చు పెట్టారనే లెక్కలేదు. ఇదే విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలు ప్రశ్నించినా బీజేపీ తెలుగు నేతల నుంచి సమాధానం రాలేదు. మిగిలిన రాష్ట్రాలలో అడిగేవారు లేరు. కేంద్రంలో చెప్పేవారు అంతకన్నా లేరు. ఇవన్నీ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌కు తెలియనిది కాదు. కాని ఏపీ అప్పుల గురించి మాత్రమే ఆయన చెబుతారు. మరి కేంద్రం ఎందుకు అప్పులు చేసింది అని సామాన్యులు ప్రశిస్తే ఆయన మాత్రం నోరుమెదపరు.

Also Read : Central Minister Comments -అన్నమయ్య ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు, అసలు వాస్తవాలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp