BJP, Corporate Funds - బీజేపీకి కార్పోరేట్ కనకాభిషేకం

By Ramana.Damara Singh Dec. 07, 2021, 09:00 pm IST
BJP, Corporate Funds - బీజేపీకి కార్పోరేట్  కనకాభిషేకం

కేంద్రంలో ఏడున్నరేళ్లుగా అధికారం చెలాయిస్తున్న ఎన్డీయే ప్రధాన భాగస్వామి బీజేపీకి కార్పొరేట్ సంస్థలు కనకాభిషేకం చేస్తున్నాయి. తాము ఏటా ప్రకటించే ఎన్నికల విరాళాల్లో ఆ పార్టీకే సింహభాగం సమర్పిస్తున్నాయి. తాజాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి ఏకంగా రూ.209 కోట్లు విరాళాలుగా అందాయి. దేశంలో అతిపెద్ద ఎన్నికల ట్రస్టుల్లో ఒకటైన ప్రుడెంట్ ఎలెక్టోరల్ ట్రస్ట్ గత ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు అందించిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఆ వివరాల ప్రకారం కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీ కూడా విరాళాలు అందుకోవడంలో బీజేపీ దరిదాపుల్లో లేవు.

84 శాతం ఆ పార్టీకే

ప్రుడెంట్ సంస్థ అందించిన నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.245.7 కోట్ల విరాళాలు అందగా వాటిలో 84 శాతం అంటే రూ. 209 కోట్లు ఒక్క బీజేపీకే అందాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అందిన దానికంటే ఇది రెండు శాతం అధికం. ఆ ఏడాది బీజేపీకి రూ. 203 కోట్ల విరాళాలు అందాయి. కాగా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ అందుతున్న విరాళాలు బాగా తగ్గిపోయాయి. గతంలో ఆ పార్టీకి రూ. 31 కోట్లు అందగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 93 శాతం మేరకు తగ్గిపోయి రూ. 2 కోట్లు మాత్రమే అందాయి. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో రూ. 11.2 కోట్లు.. ఇప్పుడు రూ. 1.7 కోట్లు అందుకుంది. బీజేపీ తర్వాత రూ. 25 కోట్లతో జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రూ. 5 కోట్లు, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) రూ. 2 కోట్ల విరాళాలు అందుకున్నాయి.

ప్రుడెంట్ ద్వారానే బడా సంస్థల విరాళాలు

అతిపెద్ద ఎలెక్టోరల్ ట్రస్ట్ అయిన ప్రూడెంట్ 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి బీజేపీకి భారీగా విరాళాలు అందిస్తోంది. దేశంలోని బడా కార్పోరేట్ గ్రూపులకు ఈ సంస్థ ద్వారానే ఎన్నికల విరాళాలు ఇస్తుంటాయి. ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సర్వీసెస్, మేఘా ఇంజనీరింగ్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్, హల్దియా ఎనర్జీ తదితర సంస్థలు ఈ ట్రస్టుకు విరాళాలు ఇస్తుంటాయి. కాగా 2016-18 మధ్య ప్రూడెంట్ ద్వారా బీజేపీకి రూ.405 కోట్ల విరాళాలు అందినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp