చంద్రబాబు వాఖ్యల ఎఫెక్ట్ - టీడీపీ పార్టీలో క్రైస్తవుల తిరుగుబాటు

By Krishna Babu Jan. 12, 2021, 08:43 pm IST
చంద్రబాబు వాఖ్యల ఎఫెక్ట్ - టీడీపీ పార్టీలో క్రైస్తవుల తిరుగుబాటు

రాష్ట్రంలో ఇటీవల జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ , సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే సమయంలోనే మత విద్వేషాలు రగిలేలా, హైందవ సమాజం మనోభావాలు దెబ్బతినేలా కొంత మంది అసాంఘిక శక్తులు దేవాలయాలపై వరుస దాడులకు పాల్పడి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో రాజకీయంగా పతనం అంచున ఉన్న చంద్రబాబు ఈ దాడులను అవకాశంగా తీసుకుని రాజకీయ లబ్దిపొందాలనే ఆదుర్ధాలో క్రైస్తవులని టార్గెట్ చేస్తూ చేసిన అనుచిత వాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపాయి. చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయ నేత ఇలా దిగజారి మతాలను టార్గెట్ చేస్తూ వాఖ్యలు చేయడం సబబుగా లేదని ఇప్పటికే అనేక మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు .

చంద్రబాబుకు పలాన పని వలన రాజకీయంగా లబ్ది కలుగుతుందంటే అందులో న్యాయన్యాయాలతో నిమిత్తం లేకుండా ఏ పని చేయడానికైనా వెనకాడరనే అభిప్రాయం అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజల్లో బలంగా ఉంది. 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రబాబు రాజకీయ నాయకుడిగా కన్నా ఈవెంట్ మ్యానేజర్ గానే వ్యవహరించారు. ఏ కార్యక్రమం చూసుకున్నా ప్రజలకు వచ్చే ఫలితం సూన్యం అయినా విపరీతమైన ప్రచారంతో హోరెత్తించారు. అందులో భాగంగానే హిందు సమాజం పవిత్రంగా భావించే పుష్కరాలను నిర్వహిస్తునట్టు చెబుతూనే మరో పక్క గుడులను ద్వంసం చేయించారు. రాజధానిలో తాత్కాలిక కట్టడాలకు కూడా వందల కోట్లు ఖర్చుపెట్టి శంఖుస్థాపనలు చేస్తూ అందులో బూట్లు వేసుకుని ఆచారాలను గాలికి వదిలేశారు. అలాగే అయ్యప్ప స్వాముల పై కూడా అనుచిత వాఖ్యలు చేయడానికి చంద్రబాబు వెనకాడలేదు. ఇవ్వన్ని చూస్తూ వచ్చిన ప్రజలకు చంద్రబాబుకు ప్రచారం మీద ఉన్న మక్కువ హైందవుల మనోభావాల పై ఉండదా అని నేరుగానే ప్రశ్నిస్తున్నారు .

ఏ మత విశ్వాసాలపైనా నమ్మకం లేని చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ పాలనలో రాజకీయ విమర్శలు చేసేందుకు తావులేక ఉన్నట్టుండి హైందవ సమాజం ఉద్దారకుడిగా వేషం మార్చారు. జగన్ పై మత ముద్ర వేసి హిందు సమాజ ఓట్లను తమ వైప్పుకు తిప్పుకునేందుకు దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని బుజాన్న ఎత్తుకున్నారు. ఏకంగా రామతీర్ధం వెళ్ళి క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడి అందరిని ఆశ్చర్య పరిచారు. గుడులు కూల్చిన చంద్రబాబు , ఉనట్టుండి ఇలా హిందు అవతారం ఎత్తి పర మతమైన క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేయడం ఎంటి? సీఎం జగన్ కు మత విద్వేషాలు అంటగడుతూ దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం ఏంటి ? అని ఆ పార్టీలోనే తీవ్ర చర్చకు దారి తీసింది.

చంద్రబాబు వాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతూ ఇప్పటికే ఆ పార్టి సీనియర్ నేత మాజీ శాసన సభ్యులు ఫిలిప్స్ తెలుగుదేశానికి రాజీనామా చేశారు. ఇక తాజాగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడు జరగని విధంగా క్రైస్తవులపై చంద్రబాబు చేసిన వాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల తెలుగుదేశం క్రీష్టియన్ సెల్ సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు వాఖ్యలు తమను భాదించాయని, క్రైస్తవ సమాజాన్ని చంద్రబాబు తన అనుచిత వాఖ్యలతో తీవ్రంగా అవమానించారని , గతంలో చంద్రబాబు చర్చీల్లో ప్రార్ధనలు చేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం సబబుగా లేదని, తెలుగుదేశం మ్యనిఫెస్టోలో క్రైస్తవుల కోసం అని హామీలు గుప్పించి ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏంటని సూటిగా ప్రశ్నిచారు. తాము ఎన్నో ఏళ్ళుగా తెలుగుదేశం కోసం పనిచేశామని, కానీ చంద్రబాబు అవేమీ దృష్టిలో ఉంచుకోకుండా క్రైస్తవులని తన మాటలతో అవమాన పరిచారని నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.

చంద్రబాబు క్రైస్తవులని టార్గెట్ చేస్తు చేసిన వాఖ్యాలకు వర్ల రామయ్య లాంటి వారు నష్ట నివారణ చర్యల్లో భాగంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా అవేమి పెద్దగా ఫలించినట్టు కనిపించడంలేదు. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల ఓట్ల కోసం మానిఫెస్టోలో వారికి చర్చీలు కట్టి ఇస్తాం, బెత్లహం వెళ్ళే ప్రయాణికుల చార్జీలకు రాయతీలు కల్పిస్తాం, జిల్లాకో క్రీష్టియన్ కమ్యునిటీ హాల్ నిర్మిస్తాం, పాస్టర్లకు ఉచిత గృహ వసతి కల్పిస్తాం అంటూ వాగ్ధానాలు చేసిన చంద్రబాబు, ఎన్నికల్లో ఓటమి పాలవడంతో వారి మతాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం మెడకు బలంగా చుట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఈ ఉచ్చు నుంచి చంద్రబాబు బయటపడటం అంత సులభం కాదని ఆ పార్టీ నేతలే ఆఫ్ దా రికార్డ్ చెప్తున్న మాట.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp