వీనుల విందుగా రామ మందిర్‌ భూమి పూజ కార్యక్రమం

By Kotireddy Palukuri Aug. 05, 2020, 12:48 pm IST
వీనుల విందుగా రామ మందిర్‌ భూమి పూజ కార్యక్రమం

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిర్‌ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం మొదలైంది. వేద పండితులు మంత్రోచ్ఛారణతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్, ముఖ్యమంత్రి యోగి అధిత్యానాథ్, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరులు భూమి పూజలో పాల్గొన్నారు. భూమి పూజకు సంబంధించిన క్రతువును వేద పండితులు ప్రధాని నరేంద్ర మోదీ చేత చేయించారు.

కోవిడ్‌ నేపథ్యంలో భూమి పూజ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో ప్రముఖలను ఆహ్వానించిన నిర్వాహకులు.. కోవిడ్‌ నిబంధనల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముందుగా భూమి పూజ ప్రాంగణం అంతా శానిటైజ్‌ చేశారు. భూమి పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆధిత్య, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్, పురోహితులు అందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp