అచ్చెన్నకు తెలిసే మాట్లాడుతున్నారా..?

స్థానిక సంస్థల ఎన్నికలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భయమట. అందుకే కోర్టుకు వెళ్లారట. ఇంకో విషయం ఏంటంటే.. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఎన్నికలు కావాలని గొడవ చేశారట. అది తగ్గిపోయిన తర్వాత ఎన్నికలు వద్దని పోరాడుతున్నారట. ఇదంతా చెబుతోంది ఎవరో తెలుసా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు. మరి ఆయన తెలుసు మాట్లాడుతున్నారో..? తెలియక మాట్లాడుతున్నారో గానీ.. మొత్తానికి మాట్లాడేశారు. టీడీపీ నేతలకు అది బాగా అలవాటై పోయినట్లుంది.
ఏపీలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గతేడాది మార్చిలో తొలుత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల దాఖలు వరకూ ప్రక్రియ అంతా సాఫీగా సాగింది. నామినేషన్ల చివరి రోజు నాటికి కూడా చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులు దొరకలేదు. సగం స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీయే లేకుండా ఏకగ్రీవం అయ్యారు. దీంతో తెలుగుదేశం నేతలకు బుర్ర పాడైంది. వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారంటూ రాద్దాంతం మొదలుపెట్టారు. ఇదిలా జరుగుతుండగానే.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండానే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించేశారు. అందుకు కారణం కరోనా అని చెప్పేశారు. ఆ రోజుకు రాష్ట్రంలో ఉన్న కరోనాల కేసుల సంఖ్య ఎంతో తెలుసా..? కేవలం 12 మాత్రమే.. మార్చి నెల చివరకు నాటికి ఆ సంఖ్య సుమారు 41కు చేరింది. జగన్ వేగవంతమైన చర్యలతో ప్రస్తుతం ఏపీలో కరోనా తీవ్రత తగ్గినప్పటికీ.. రోజుకు 100 నుంచి 300 కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీనికితోడు సిబ్బంది అంతా వ్యాక్సినేషన్లో బిజీగా ఉన్నారు. కానీ సదరు అచ్చెన్ననాయుడు గారు కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఎన్నికలు కావాలని గొడవ చేశారంటూ ఆరోపిస్తున్నారు. పై లెక్కలను బట్టి చూస్తే కరోనా తీవ్రత అప్పుడుందా..? ఇప్పుడుందా..? ఆయనకే తెలియాలి.
ఇంకో విషయంటే వాస్తవానికి స్థానిక టీడీపీ హయాంలోనే 2018లో జరగాల్సి ఉంది. అప్పటికి ప్రజావ్యతిరేకతకు భయపడి వాయిదా వేసుకుంటూ వచ్చిన విషయం ఎవరికీ తెలియదని అచ్చెన్నాయుడు భ్రమల్లో ఉన్నట్టున్నారు. స్థానిక సంస్థల పదవీ కాలం గడువు ముగియగానే తమ హయాంలో ఎన్నికలు జరిపి ఉంటే ... అసలు ఈ రోజు ఇలాంటి దుస్థితి వచ్చి ఉండేదే కాదనే వాస్తవాన్ని అచ్చెన్నాయుడు గ్రహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏపీ అధ్యక్షుడు అయ్యాక అచ్చెన్నాయుడి ప్రకటనలు చూస్తుంటే ఏదో మాట్లాడేయాలనే ఆదుర్దా తప్పా అసలు విషయం ఉండడం లేదని రాజకీయ వర్గాల టాక్.


Click Here and join us to get our latest updates through WhatsApp